ఆ వివాదాస్పద జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెడుతున్న అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే అందులో ఒకటి ఇసుక కాగా, మరొకటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం.దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నా ఏపీ ప్రభుత్వానికి తెలుగు భాష పై మమకారం లేదు, తెలుగు భాషను చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించాయి.

 130ap Government Relised New Order8128 2-TeluguStop.com

అయినా జగన్ ఈ విషయంలో కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు.

తాజాగా ప్రభుత్వ పాఠశాలలో ఇహ్గిలీషు మీడియం ప్రవేశపెట్టడంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జీవో లో పేర్కొన్నారు.అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా పేర్కొన్నారు.

ఇక ఆ తర్వాత నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని ఆ జీవోలో వివరించారు.

అలాగే ఉపాధ్యాయులకు దీనిపై పూర్తి శిక్షణ ఇవ్వడంతోపాటు హ్యాండ్ బుక్స్ బాధ్యతను అప్పగించబోతున్నారు.

ఇకపై ఉపాధ్యాయ నియామకాలు అన్నీ ఆంగ్ల ప్రావీణ్యం ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube