పాకిస్థాన్ లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి విష్ణుమూర్తి ఆలయం

సనాతన హిందూ ధర్మం ఆనవాళ్లు విశ్వవ్యాప్తం అని ఇప్పటికే చాలా సందర్భాలలో ప్రూవ్ అయ్యింది.ఎన్నో దేశాలలో సనాతన ధర్మం ఆనవాళ్లు బయటపడ్డాయి.

 1,300 Years Old Hindu Temple Discovered In Pakistan, Indian History, Hinduism, A-TeluguStop.com

చరిత్రకారులు ఎన్నో వేళ్ళ ఏళ్ళుగా ఇప్పటికి సజీవంగా ఉన్న నాగరికత హిందూ నాగరికత అని చెబుతున్నారు.అలాగే దేశాలు ఎన్ని ఉన్న సనాతన ధర్మం ఆనవాళ్లుగా నిలిచే హిందూ దేవాలయాల ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బయటపడుతూనే ఉంది.

ఇక భారతదేశం నుంచి స్వాతంత్ర్య కాలంలో విడిపోయిన పాకిస్థాన్ కూడా ఒకప్పుడు హిందూ రాజుల పాలనలో ఉండేది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి.కాలక్రమంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు పాకిస్థాన్ లో నివాసం ఉండటం వలన అక్కడ ఉన్న హిందువులు ఇతర ప్రాంతాలకి వలస పోవడం వలన జనాభా వ్యత్యాసం వచ్చింది.

అయితే ఇప్పటికే ఎన్నో హిందూ దేవాలయాలు పాకిస్థాన్ లో కనిపిస్తాయి.పురావస్తి తవ్వకాలలో హిందూ దేవాలయాల ఉనికి బయట పడుతుంది.

Telugu Hindu Temple, Hindu, Discovered, Hinduism, Indian, Pakistan-Latest News -

ఇప్పుడు అలాగే 1300 ఏళ్ల నాటి విష్ణుమూర్తి దేవాలయం పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో వెలుగుచూసింది.స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటలీ, పాకిస్థాన్ దేశాలకు చెందిన పురావస్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది.ఈ విషయాన్ని పాక్ పురావస్తుశాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు.హిందూషాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెప్పారు.చరిత్ర ప్రకారం క్రీస్తుశకం 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు పాలించారు.వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారు.

దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా చెపుతారు.వీరు వాయవ్య భారత ప్రాంతాన్ని పాలించినట్టు కూడా చరిత్రలో ఉంది.

ఈ రాజ్యవంశీకులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెపుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube