విడ్డూరం : 11 ఏళ్ల అబ్బాయి, 13 ఏళ్ల అమ్మాయిల వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా?

పెరుగుతున్న టెక్నాలజీకి ఆనందించాలో లేదంటే పిల్లలపై ఆ టెక్నాలజీ చూపుతున్న ప్రభావం చూసి భయపడాలో అర్థం కాని పరిస్థితి.ఆ టెక్నాలజీని పిల్లలు ఏ స్థాయిలో వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 13 Years Girl And 11 Years Boy Become Mother And Father-TeluguStop.com

చిన్న పిల్లలకు మొబైల్స్‌.ట్యాబ్స్‌ ఇస్తున్న కారణంగా వారు చిన్న తనంలోనే చాలా పెద్ద విషయాలను తెలుసుకుంటున్నారు.

ఆ విషయాలు ఊరికే ఉంటాయా.పెద్ద వారి తరహాలో ప్రవర్తించేందుకు ప్రయత్నించి మొదటికే మోసం తెచ్చుకుని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

ఇండియాలో ఇంకా అక్కడికి రాలేదు కాని అమెరికా, రష్యా మరియు ఇతర అభివృద్ది చెందిన దేశాల్లో పిల్లల జీవితాలు ఏ స్థాయికి నాశనం అవుతున్నాయో ఈ సంఘటన ద్వారా తెలిసి పోతుంది.

Telugu Boy Pregnant, Boy Latest, Boy Mother, Doctors, Russian Latest, Telugu Gen

  రష్యాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.13 ఏళ్ల ఒక బాలిక కొన్ని రోజులుగా కడపు నొప్పితో బాధపడటంతో పాటు కాస్త లావుగా అవ్వడం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం జరుగుతుంది.ఆమెలో మార్పును గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకు వెళ్లగా ఆ బాలిక గర్బవతి అంటూ తేలింది.

నోరు వెళ్లబెట్టిన కుటుంబ సభ్యులు ఇందుకు కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు.ఆ సమయంలో తనకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడైన 11 ఏళ్ల బాలుడి పేరు చెప్పింది.

Telugu Boy Pregnant, Boy Latest, Boy Mother, Doctors, Russian Latest, Telugu Gen

  ఈసారి ఆమె తల్లిదండ్రులతో పాటు డాక్టర్లు కూడా నోరు వెళ్లబెట్టారు.ఎందుకంటే 13 ఏళ్ల అమ్మాయికి 11 ఏళ్ల కుర్రాడు ఎలా ప్రెగ్నెంట్‌గా చేస్తాడు అనేది వారి అనుమానం.11 ఏళ్ల కుర్రాడు తండ్రి అవ్వడం అసాధ్యం అంటున్నారు.ఆ పని చేస్తే చేయవచ్చేమో కాని ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కాకపోవచ్చు అంటున్నారు.

ఆమె మరెవ్వరితో అయినా ఆ పని చేసిందా అనే కోణంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు.ఇదే సమయంలో ఆ 11 ఏళ్ల కుర్రాడికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఒక వేళ 13 ఏళ్ల బాలిక కడుపులో ఉన్న పిండంకు తండ్రి ఆ 11 ఏళ్ల బాలుడు అని తేలితే ఏం చేస్తారో అనేది ప్రస్తుతం అందరిలో ఎదురవుతున్న ప్రశ్న.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube