ఆ విషయంలో కన్న తండ్రి పై గ్రామసభలో కుమారుడి ఫిర్యాదు.. చివరికి..?!

13 Years Boy Complaints In Grama Sabha Over Her Father Drinking Habit

తన తండ్రి మద్యానికి బానిస అయ్యాడని, తండ్రితో ఎలాగయినా సరే మందు తాగడం మాన్పించాలని ఒక 13 సంవత్సరాల బాలుడు చేసిన పని ఏంటో తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.తండ్రి కోసం ఆ బాలుడు పడిన తపన అంతా ఇంతా కాదు.

 13 Years Boy Complaints In Grama Sabha Over Her Father Drinking Habit-TeluguStop.com

ఎన్ని విధాలుగా చెప్పిన తన తండ్రి మద్యం తాగడం మానడం లేదని ఈ విషయాన్ని ఏకంగా తన ఊరి గ్రామసభలో ఫిర్యాదు చేసాడు.మరి ఆ గ్రామపెద్దలు ఇచ్చిన తీర్పు ఏంటి.

ఆ బాలుడు తండ్రి మద్యం తాగడం మానేశాడా.? లేదా అనే వివరాలు తెలుసుకుందాం.

 13 Years Boy Complaints In Grama Sabha Over Her Father Drinking Habit-ఆ విషయంలో కన్న తండ్రి పై గ్రామసభలో కుమారుడి ఫిర్యాదు.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహారాష్ట్రలోని యావత్మాల్​ జిల్లా ఆర్ణీ తాలుకాలోని లోన్​బెహ్​ల్​ కు చెందిన రాజు అనే అతను మద్యానికి బానిస అయిపొయి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసాడు.రాజుకు 13 ఏళ్ల అంకుశ్​ అనే కొడుకు ఉన్నాడు.

తన తండ్రికి కొంత సాగు భూమి ఉన్నాగాని అతని తాగుడుకు అలవాటు పడిపోయి, వచ్చిన డబ్బంతా మద్యం కోసమే ఖర్చు పెట్టేసేవాడు.దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది.

పాపం తప్పని పరిస్థితుల్లో అంకుశ్ కూరగాయలు అమ్ముతూ తన తల్లికి సాయంగా ఉంటున్నాడు.తన సోదరిని డాక్టర్​ చదివించాలనేది అతని కల కానీ.తన తండ్రి తాగుడు మానకపోతే తన కల నెరవేరదని గ్రహించిన అతడు ఎలాగయినా తండ్రితో మద్యం మాన్పించాలని ఒక ఆలోచన చేసాడు.13 ఏళ్ల అంకుశ్ ఈ విషయాన్ని గ్రామ సభలో గ్రామపెద్దల ముందు తెలిపాడు.తన తండ్రిని తాగుడు మాన్పించాలని అంకుశ్ గ్రామ పెద్దలకు విన్నవించుకోగా గ్రామ పెద్దలు ఆ బాలుడి తండ్రి రాజును ఇంకెప్పుడు మద్యం తాగవద్దని ఆదేశించారు.

Telugu Boy, Ankush, Complaint, Grama Sabha, Habit, Raju, Maharashtra, Latest-Latest News - Telugu

జీవితంలో మళ్లీ ఎప్పుడు మద్యం ముట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు.గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పును రాజు కూడా ఒప్పుకునీ, తన కమారుడి కోసం ఇంకా జీవితంలో మందు ముట్టను అని వాగ్దానం కూడా చేశాడు.13 ఏళ్ల అంకుశ్​ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదవుతున్నాడు.అలాగే మందు తాగితే కలిగే దుష్ప్రభావాల గురించి గ్రామమంతా తిరిగి ప్రచారం చేసేవాడు.

Telugu Boy, Ankush, Complaint, Grama Sabha, Habit, Raju, Maharashtra, Latest-Latest News - Telugu

బాలుడి ఆలోచనను మెచ్చుకుని ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ బాలుడు తండ్రి రాజును మద్యం మానేయాలని చెప్పడంతో పాటు అందుకు శిక్షగా ఐదు గుంజీలు కూడా తీయించారు.గ్రామపెద్దలు ఇచ్చిన తీర్పుతో అంకుశ్ సంతోషంలో మునిగి తేలిపోయాడు.ఇంకా తన తండ్రి తాగుడు మానేయడంతో పాటు తమ కుటుంబ కష్టాలు తీరతయాని అంకుశ్ ఆనంద పడ్డాడు.

చిన్నవయసులో అంకుశ్ ఆలోచనను గ్రామ పెద్దలు మెచ్చుకుని సన్మానం చేసారు.

#Boy #Raju #Complaint #Ankush #Complaint

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube