పాక్, ఆఫ్గన్, బంగ్లాదేశ్‌లలోని ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం.. ఆ కలెక్టర్లకు అధికారం

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన ముస్లిమేతరులు ( హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు)కు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ దేశాల నుంచి భారత్ వచ్చి.

 13 More District Collectors Empowered To Grant Citizenship To Applicants From 3-TeluguStop.com

పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, హర్యానా, పంజాబ్‌లలోని 13 జిల్లాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు.

దరఖాస్తు, ఇతర నిబంధనలు పరిశీలించి వీరికి భారత పౌరసత్వాన్ని ఇచ్చే అధికారాన్ని ఆ 13 జిల్లాల కలెక్టర్లకు ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం… గుజరాత్‌లోని వడోదర, పఠాన్, రాజ్‌కోట్, మార్బీ….

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, బలోదాబజార్,….రాజస్థాన్‌లోని జలోర్, ఉదయ్‌పూర్, పాళీ, బార్మెర్, సిరోహీ….

హర్యానాలోని ఫరీదాబాద్,… పంజాబ్‌లోని జలంధర్‌లలో నివసించే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు… భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

కేంద్ర హోంశాఖ చెప్పిన దాని ప్రకారం… పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోగానే వెంటనే దాన్ని కేంద్రం ఆమోదిస్తుంది.

అటు రాష్ట్ర స్థాయిలో కలెక్టర్, హోం సెక్రెటరీ వీటిని ఆమోదిస్తారు.ఏవైనా వివరాలు కావాల్సి వచ్చినా, మార్పులు అవసరం అయినా… ఎప్పటికప్పుడు కేంద్రం వాటిని కోరుతూ తుది నిర్ణయం తీసుకుంటుంది.

జిల్లా కలెక్టర్… ఇచ్చిన వివరాలతో సంతృప్తి చెందితేనే పౌరసత్వం కల్పిస్తారు.ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేస్తారు.దానిని ప్రింట్ తీసి… కలెక్టర్ సంతకం చేసి అందజేస్తారు.

Telugu Collectors, Citizenship-Telugu NRI

2019 లో అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద నిబంధనలు ఇంకా రూపొందించబడనప్పటికీ, పౌరసత్వ చట్టం 1955 లోని సెక్షన్ 16 కింద, 2009లో చట్టం ప్రకారం రూపొందించబడిన నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా, 2019లో సిఎఎ అమల్లోకి వచ్చినప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా నిరసనలు జరిగాయి.ఈ నిరసనల నేపథ్యంలో 2020 ప్రారంభంలో ఢిల్లీలో అల్లర్లు కూడా జరిగాయి.సీఏఏ చట్టం ప్రకారం.2014 డిసెంబర్ 31 వరకు భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ తదితర ముస్లింయేతర మైనారిటీలకు భారత పౌరసత్వం లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube