ఆ పోటీలో పాల్గొన్న భామలకు షాక్..13 మందికి కరోనా

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలను పొగొట్టుకున్నారు.

 13 Members Tested Positive In Bangkok Beauty Contest-TeluguStop.com

ఇంకొందరు అనాధలుగా మిగిలారు.అనేక దేశాలు భారీ నష్టాలను చవిచూస్తూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.ఇదిలా ఉండగా మరో వైపు ఫంగస్ ల అలజడి ఎక్కువయ్యింది.

 13 Members Tested Positive In Bangkok Beauty Contest-ఆ పోటీలో పాల్గొన్న భామలకు షాక్..13 మందికి కరోనా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్లాక్ ఫంగస్, గ్రీన్ ఫంగస్, ఆరెంజ్ ఫంగస్ అంటూ రకరకాల ఫంగస్ కేసులు నమోదయ్యాయి.తాజాగా వాటికి కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.

ఇలాంటి సమయంలో డెల్టా వేయింట్, లాంబ్డా వేయింట్, ఇలా పలు రకాల వేరియంట్ల వల్ల ప్రజలు మరోసారి భయబ్రాంతులకు గురవుతున్నారు.ఓ వైపు వేరియంట్ల కేసులు ఎక్కువవుతున్నాయి.

తాాజాగా కరోనా కేసులు కూడా పలు ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో కరోనా కలకలం రేపింది.

ఈ అందాల పోటీల్లో పాల్గొన్నటువంటి 13 మంది అందగత్తెలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

గత నెలలో ఈ అందాల పోటీ అనేది జరిగింది.

ఈ కార్యక్రమంలో మొత్తం 22 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.థాయ్ లాండ్ ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతోంది.ఈ నేపథ్యంలో ఇలా జరగడంపై బ్యాంకాంక్ బ్యూటీ కాంటెస్ట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.13మంది పోటీదారులకు, మరో 9మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు బ్యాంకాంక్ పోస్ట్ తెలియజేసింది.

Telugu 13 Members, Bangkok Beauty Contest, Bangkok Post, Beauty Competition, Covid Positive, Social Media, Tested, Tested Positive, Viral Latest, Viral News-Latest News - Telugu

పాజిటివ్ వచ్చిన వారిలో విన్నర్ పోర్నాచక్ శ్రీకయో కూడా ఉండటంతో ఈ ఘటన కలకలం రేపుతోంది.అభ్యర్థులతో పాటు నిర్వాహకులు పబ్లిక్ హెల్త్ రూల్స్ పట్టించుకోకుండా ప్రవర్తించడం వల్లే ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.కొన్ని ప్రత్యేక పరిమితులతో మాత్రమే అనుమతి ఇచ్చామని పోలీసులు ఆరోపించినప్పటికీ ఇందులో బాధ్యులైన వారందరిపైన యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు.పోటీ జరిగిన సమయంలో అంతా కంటెస్టెంట్లు గౌన్లలో కనిపిస్తూ మాస్కులు అస్సలు ధరించలేదని అందరూ ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

#COVID #Bangkok #Members #Bangkok Contest

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు