చరిత్రలో నిలిచిపోయేలా...100 మంది సాహితీ వేత్తలతో..రెండు రోజులు ...20 గంటలపాటు

తెలుగు సాహితీ వేత్తలు అందరూ కలిసి చరిత్రలో నిలిచిపోయేలా కెనడాలో ప్రత్యేక తెలుగు సాహితీ కార్యక్రమం నిర్వహించడానికి భారీ ఏర్పాటు చేస్తున్నారు.మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు అలాగే 12 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ,ప్రత్యేక తెలుగు బాష, కలగలసిన సాహిత్య సమావేశం నిర్వహించనున్నారు.

 12th Telugu Sahithi Sadhassu America Details-TeluguStop.com

ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.ఈ నెల 25 , 26 తేదీలలో కెనడా రాజధాని టొరంటో లో వర్చువల్ విధానం ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.అయితే

గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ సాహిత్య వేడుకలను ఏర్పాటు చేయనున్నారట.సుమారు రెండు రోజుల పాటు, ఉదయం 9 గంటల నుంచీ సాయంత్రం 7 గంటల వరకూ జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 12th Telugu Sahithi Sadhassu America Details-చరిత్రలో నిలిచిపోయేలా…100 మంది సాహితీ వేత్తలతో..రెండు రోజులు …20 గంటలపాటు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంత భారీ స్థాయిలో సుమారు 20 గంటల పాటు ఎన్నడూ సాహితీ సదస్సు జరగలేదని, మొదటి సారిగా కెనడాలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు అంటున్నారు.ఇదిలాఉంటే

సాహితీ సదస్సును రెండు రోజుల పాటు ఆన్లైన్ ద్వారా వీక్షించాలనుకునే వారు

సెప్టెంబర్ 25 కార్యక్రమాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి చూడవచ్చును

YouTube: https://bit.ly/3zcq0O1

సెప్టెంబర్ 26 కార్యక్రమాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి చూడవచ్చును

YouTube: https://bit.ly/3mjgLYS

ఈ సదస్సుకు సంభందించి ఎలాంటి సందేహాలు, మరింత సమాచారం కావాలన్నా కెనడాలో ఉండే లక్ష్మీ రాయవరపు, వంగూరి చిట్టెన్ రాజు, లను ఈ మెయిల్స్ ద్వారా సంప్రదించవచ్చు

ఈమెయిల్ – [email protected] , [email protected] లను సంప్రదించవచ్చునని , ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని నిర్వాహకులు కోరారు.

.

#America #TeluguSahithya #TeluguSahithi #TeluguSahithya #NRIS

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు