పరీక్షల్లో పాస్ అవ్వడానికి వింత సమాధానాలు రాసిన విద్యార్థులు..!

చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకు పరీక్షలంటే ఓ భయం పుడుతుంది.ఎంత బాగా చదివే విద్యార్థైనా సరే పరీక్ష సమయంలో టెన్షన్ గానే ఉంటారు.

 12th-answer-key-2020-students-bihar Exams, Students, Crazy Answers, Bihar,  Stud-TeluguStop.com

ఇక కొందరు విద్యార్థులైతే ఉన్న ప్రశ్నలకి అసలైన సమాధానాలు రాయకుండా ఉంటే మరికొందరు ఆ ప్రశ్నలకు వింత వింత సమాధానాలు రాస్తుంటారు.అది కూడా తమర్ని పాస్ చేయమంటూ తమకున్న బాధలను పేరాగ్రాఫ్ లంతా రాసి వదిలేస్తారు.

ఇలా ఏదో ఒక చోట జరుగుతుంటుంది.

తాజాగా ఈ ఘటన బీహార్ లోని జరుగగా ఇటీవలె 12వ తరగతి పరీక్షలు పూర్తికాగా సమాధాన పత్రాలు దిద్దే ప్రక్రియ కూడా పూర్తయింది.

ఇక ఈ తరుణంలో విద్యార్థులు రాసిన సమాధానాలు బాగా వైరల్ గా మారాయి.ఇలా చాలా మంది విద్యార్థులు తమ ప్రశ్నపత్రాలలో తమర్ని పాస్ చేయమని వింత వింత సమాధానాలు రాగా అందులో ఒకరు మే 26న నా వివాహం జరగనుంది.

ఒకవేళ ఫెయిల్ అయ్యానంటే ఏమవుతుందో తెలియడం లేదు.అందుకే సార్ నన్ను ఫస్ట్ విధంగా పాస్ చేయండి అంటూ రాయగా.

Telugu Bihar, Crazy Answers, Exams-Latest News - Telugu

సార్ నాదొక అభ్యర్ధననేను బాగా రాయలేకపోయాను.ఆరోగ్యం బాగోలేదు.జ్వరం వచ్చిందిసార్ మీ కుమార్తె గా భావించి, మంచి మార్కులు వేయండి.సార్ మీరు నన్ను ప్రమాణ పూర్వకంగా మీ కుమార్తెగా భావించి నన్ను పాస్ చెయ్యండి.

సార్ మాది చాలా పేద కుటుంబం.కుమార్తెగా బావించి, నన్ను అర్థం చేసుకోండి అంటూ మరొక విద్యార్థిని రాగా శ్రీ రాముని సేవలో సార్ సవినయంగా మనవి చేస్తున్నాను.

నేను హనుమంతుని భక్తుడను.పూజలు చేస్తూ నీరసించి పోయి, కింద పడిపోయాను.

మంచి మార్కులు వేయండి సార్ నన్ను క్షమించండి.నేను చాలా పేదవాడిని.

నిస్సహాయుడను.మీరు కోరితే మీ పాదాలపై వాలిపోతాను.

మంచి మార్కులు ప్రసాదించండి” అంటూ తమ బాధల్ని పంచుకుంటూ పాస్ చేయమని కోరారు విద్యార్థులు.

ఇక ఈ సందర్భంగా పరీక్ష పత్రాలు దిద్దిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పలువురు విద్యార్థులు కరోనా పరిస్థితులవల్ల సరిగా చదవలేక పోయారని అంతే కాకుండా పలువురు విద్యార్థులు తాము అనారోగ్యంతో బాధపడుతున్నామని, అందుకే తమను పాస్ చేయాలని సమాధాన పత్రాల లో వేడుకున్నారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube