శ్రీలంక బాంబు పేలుళ్లు! 125కి చేరిన మృతుల సంఖ్య!  

శ్రీలంక ఉగ్రదాడిలో 125కి చేరిన మృతుల సంఖ్య. .

125 People Died In Srilanka Terror Bomb Blasts-

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటల్స్ ను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు.ఈ వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 125కు చేరింది.వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది.ఇక మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు ఇప్పటి వరకు పోలీస్సులు గుర్తించారు..

125 People Died In Srilanka Terror Bomb Blasts--125 People Died In Srilanka Terror Bomb Blasts-

కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి.కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు జరిగినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ పేలుళ్ళపై శ్రీలంక ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సే దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

పేలుళ్లపై దర్యాప్తుకి ఆదేశించినట్లు తెలియజేసారు.ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు.ఈ ఘటనపై భారత్ హై కమిషన్ తో మాట్లాడటం జరిగిందని, అక్కడి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేసామని చెప్పారు.

అలాగే అక్కడ భారతీయుల సహాయార్ధం శ్రీలంకలోని భారత రాయభార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది.సమాచారం కోసం +94 777903082, +94112422788, +94 112422789, +94 777902082, +94772234176 నంబర్లను సంప్రదించాలని కోరింది.