పసికందుపై..బాలుడి అత్యాచారం..అతడి వయసు తెలిస్తే షాక్ అవుతారు.       2018-06-09   23:21:41  IST  Raghu V

తమ పిల్లలు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తుంటే చూసి తెగ ముచ్చట పడిపోతూ ఉంటారు తల్లి తండ్రులు..మా వాడు సెల్ ఇట్టే ఆపరేట్ చేస్తాడు..నాకు కూడా ఇన్ని విషయాలు ఉన్నాయని తెలియదు..అంటూ ముచ్చట పడిపోయే తల్లితండ్రులు ఈ న్యూస్ తప్పకుండా చదవాల్సిందే..ఎందుకంటే పిల్లలు చిన్న ప్రాయంలోనే ఎలా దారుణమైన చెడు అలవాట్లకి కారణం అవుతున్నారో అసలు వారు అలా అవాదానికి కారణం తల్లి తండ్రులే అనే విషయం అర్థం అవుతుంది..వివరాలలోకి వెళ్తే..

రెండేళ్ళ వయసున్న పసికందుపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు..ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది..12 ఏళ్ల బాలుడు సెల్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలు చూడ్డానికి అలవాటుపడ్డాడు..అయితే ఈ క్రమంలోనే బాలుడు బుధవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తర్వాత గ్రామంలో జన సంచారంలేని ఓ ఆలయ పరిసరాల్లో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు…అయితే చిన్నారి అరుపులు వింటే ఎవరైనా వస్తారని భయపడిన అతడి ఒక కర్రతో ఆమె తలపై కొట్టి గొంతు నులిమి చంపేశాడు.

అయితే ఆ బాలిక తల్లి తండ్రులు ఎంతగా వెతికినా ఆమె కుమార్తె కనిపించక పోవడంతో పోలీసులని ఆశ్రయించారు దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిసి టీవీ పుటేజ్ లని పరిశీలించగా వారి ఇంటికి దగ్గరలోనే ఉండే బాలుడు ఆ బాలికని తీసుకుని వెళ్ళినట్టుగా గుర్తించారు అయితే…దీంతో బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకి బాలుడు జరిగినది అంతా చెప్పే సరికి షాక్ అయ్యారు..

అయితే చిన్నారికి శవానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి పై అత్యాచారం జరిగిన విషయం చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు..నేరాన్ని అంగీకరించిన బాలుడిని హత్యానేరం కింద నిందితుడిని బాల నేరస్థుల పరివర్తన గృహానికి పంపినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. తమ కుమారుడు సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూడ్డానికి బాగా అలవాటుపడ్డాడనీ, ఇంతపని చేస్తాడని అనుకోలేదని పేయింటరుగా పనిచేస్తున్న నిందితుడి తండ్రి తెలిపారు..పిల్లలకి సెల్ ఫోన్ లు ఇచ్చి వారు చేస్తున్న పనులకి సంతోష పడిపోయే తల్లి తండ్రులు ఆ పిల్లలు ఫోన్ లో ఎలాంటి విషయాలు చూస్తున్నారో కూడా తెలుసుకోవడం ముఖ్యమని తెలిపారు.