పవన్, జగన్ కు చుక్కలు చూపిస్తున్న 'యామిని సాధినేని' గురించి ఈ 12 విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.!   12 Unknown Facts About Yamini Sadineni     2018-10-21   09:03:56  IST  Sainath G

యామిని సాధినేని…. గుంటూరుకు చెందిన ఈమె తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏ.పి నైపుణ్యాభివృద్ధి కమిటీ మెంబర్ గా కొందరికే తెల్సిన యామిని పేరు ఇప్పుడు ఏపీలో మారుమోగిపోతోంది. ఓ వైపు కుటుంబం చూసుకుంటూ,మరో వైపు వ్యాపార రంగం లో రాణిస్తూ…ఇంకోవైపు రాజకీయ రంగం లో దూసుకుపోతూ తనదైన ముద్ర వేస్తున్నారు.

1. యామిని సాదినినేని గారి తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. హైదరాబాద్ లోనే యామిని గారు చదువు కొనసాగాయిన్చారు. ఎం.బి.ఏ పూర్తి చేసారు.

2. ఆ తర్వాత వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆసక్తి కలగడంతో అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ కోర్సులు అభ్య‌సించారు. తుఫాన్ లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్య‌వ‌స‌ర‌మ‌య్యే హ్యామ్ రేడియో ఆపరేటర్ గా పేరుగాంచారు.

12 Unknown Facts About Yamini Sadineni-

3. హుదూద్ తుపాన్,చెన్నై వరదలు, లైలా తుపాన్,ల‌లోనే కాక పొరుగు దేశ‌మైన‌ బంగ్లాదేశ్ వరదల సమయంలోనూ హ్యామ్ రేడియోతో సేవలందించారు..

12 Unknown Facts About Yamini Sadineni-

4. సెల్ ఫోన్స్,టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయని ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంకా చెప్పాలంటే అత్యవసర సమయంలో వినియోగించే హ్యామ్ రేడియోలు నేరుగా శాటిలైట్ కి కనెక్ట్ అయివుంటాయి.

5. వరల్డ్ వైడ్ గా హ్యామ్ రేడియో ఆపరేటర్లు కొందరే ఉంటారు. అందులో యామిని సాధినేని ఒక‌రు.

12 Unknown Facts About Yamini Sadineni-

6. తుపాన్ ల సమయంలో తాను అందించిన సేవలకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వ‌నిత యామినీ సాదినేని.

7. ఎపి నైపుణ్యాభివృద్ధి కమిటీ మెంబర్ గా 27రంగాలలో శ్రమిస్తున్న ఈమె, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తూ,అందిస్తున్న సేవలను ఐక్య రాజ్య సమితి గుర్తించి, పీస్ కనెక్ట్ పిన్ అనే ప్రతిష్ఠాత్మక అవార్డుని కూడా అందుకుంది. ఈ అవార్డుతో స్పెషల్ స్క్రాప్ ని ప్రధానం చేసారు. ఈ అవార్డు అందుకున్న తోలి భారతీయ మహిళ ఆమె

12 Unknown Facts About Yamini Sadineni-

8. ఓ ఫార్మా కంపెనీ నెలకొల్పి అనతికాలంలోనే కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు.

9. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి చేపట్టిన కొద్దిరోజులకే ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శిస్తూ అందరి దృష్టిలో పడ్డారు.

12 Unknown Facts About Yamini Sadineni-

10. ముఖ్యంగా తుపాన్ కి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో నేటికీ కరెంట్ రాలేదంటూ జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ నేపథ్యంలో ఆధారాలతో సహా రిప్లై ఇచ్చి యామిని సాధినేని తన స్టామినా ఎలాంటిదో చూపించారు.

11. పవన్,జగన్ లకే కాక మాట‌ల మ‌రాఠీ టియ్యారెస్ అధినేత‌కు త‌న యాస‌లోనే ధీటైన కౌంట‌ర్ ఇచ్చి తానేంటో నిరూపించారు.

12 Unknown Facts About Yamini Sadineni-

12. ఒక్క తెలుగే కాదు, త‌మిళం, క‌న్న‌డ‌, బంగ్ల‌, హింది, ఇంగ్లీష్ బాష‌ల్లో ప్రావీణ్యం పొందారు. టిడిపిలో అతికొద్ది సమయంలోనే మంచి గుర్తింపు పొందారు యామిని.