ఆ మట్టిలో 12 పుర్రెలు.. ఎముకలు!

దేశవ్యాప్తంగా వర్షాలు ఎలా కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వంకలు, వాగులు పెరిగిపోయి అన్ని నిండిపోతున్నాయి.

 12 Human Skulls, Land Slide, Debris-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఓ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి.అలా కొండచెరియలు విరగడం కారణంగా ఎవరికి ఎటువంటి హాని జరగలేదు కానీ అందులో నుంచి బయటపడ్డ 12 పుర్రెలు, ఎముకలు, నగలే అందరిని భయపెడుతున్నాయి.

ఈ ఘటన మిజోరాంలోని మమిత్ జిల్లాలో చోటుచేసుకుంది.శుక్రవారం రోజు కొండా చెరియలు కూలిపోయాయి.దీంతో అక్కడికి వెళ్లగా అక్కడ 12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు, స్మోకింగ్ పైప్, కొన్ని పాత్రలు దొరికాయి.ఈ విషయాన్నీ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్‌రోజామా వెల్లడించారు.

ఈ విషయంపై అతను మాట్లాడుతూ. ”ఈ పుర్రెలు, ఎముకలు, బంగారు ఆభరణాలు ఏకాలం నాటివో నేను సరిగ్గా చెప్పలేను.సరైన వివరణ లేకుండా వాటి కాలాన్ని అంచనా వెయ్యలేము.అందుకే ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయను” అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

ఇంకా అక్కడ దొరికిన వస్తువులు అన్నింటిని కూడా ఫోరెన్సిక్ విభాగానికి పంపుతున్నట్లు అయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube