కళ్యాణ్ రామ్, నివేత థామస్ జంటగా తెరకెక్కిన 118 హిట్ కొట్టిందా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!  

 • ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మాతగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహ‌న్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో, హీరోయిన్లుగా నటించిన 118 చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ సమీక్షలో చూసేద్దామా.

 • Cast and Crew:
  న‌టీన‌టులు: కళ్యాణ్ రామ్, నివేత థామస్, షాలిని పండేయ్ తదితరులు
  ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహన్
  నిర్మాత‌: మ‌హేష్ ఎస్‌.కోనేరు
  సంగీతం:శేఖర్ చంద్ర
  సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్

 • కథ :

 • గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఓ జర్నలిస్ట్. కలలో కనిపించిన అమ్మాయి కోసం గౌతమ్ వెతుకుతూ ఉంటాడు. అతనికి వచ్చే కలను ట్రేస్ చేయడానికి అతని టీం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే వరంగల్ లో ఆద్య (నివేత థామస్) రూపంలో తనకు సమాధానం దొరుకుతుంది. ఆధ్య ఎవరు.? ఆమె కథ ఏంటి.? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.!

 • 118 Telugu Movie Review-Kalyan Ram Nivetha Thomas Shalini Pandey

  118 Telugu Movie Review

 • నటీనటుల ప్రతిభ:

 • కళ్యాణ్ రామ్, నివేదా థామస్ నటన చాలా బాగుంది. నివేదా థామస్ కనిపించేది కేవలం 20 నిమిషాలే అయినా మిగిలిన రెండు గంటలు తన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. షాలిని పాండే తన పాత్రకు న్యాయం చేసింది. నా నువ్వే తర్వాత రొటీన్ కి భిన్నంగా కొత్త కాన్సెప్ట్ తో ముందుకి వచ్చి అలరించారు కళ్యాణ్ రామ్.

 • టెక్నికల్ గా:

 • శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్‌ నిజజీవితంలోని అనుభవంలోంచి పుట్టిన కథ. వాటికి అక్షరరూపాన్ని కల్పించి 118 సినిమాను తెరకెక్కించారు. హైటెక్నికల్ వ్యాల్యూస్, కథ, కథనాలే బలంగా 118 రూపొందినట్టు సినీ వర్గాల్లో ప్రచారమైంది.

 • విశ్లేషణ :
  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సెకండ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో గా నడుస్తుంది. కలలో కనిపించిన అమ్మాయి కోసం ఓ యువకుడు తిరిగే కథ ఇది. టైటిల్ 118 అని ఉంటే…దాని వెనక ఏదో మిస్టరీ ఉండి ఉంటుంది అని అందరు అభిప్రాయపడ్డారు. అర్ధరాత్రి ఒంటిగంట పద్దెనిమిది నిమిషాలకు యువకుడికి వచ్చిన కల నేపథ్యంలో ఈ సినిమాకు 118 అని టైటిల్ ఫిక్స్ చేశారు. పరిగెత్తే కథనం సినిమాను బాగా కలిసొచ్చిందని మరికొందరి మాట. మొత్తంగా చూసుకుంటే థ్రిల్లర్ అదిరిపోయింది. నివేత థామస్ నటనకు కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టాల్సిందే.

 • 118 Telugu Movie Review-Kalyan Ram Nivetha Thomas Shalini Pandey
 • ప్లస్ పాయింట్స్ :

 • కళ్యాణ్ రామ్,
  నివేత థామస్,
  సినిమాటోగ్రఫీ
  స్క్రీన్ ప్లే
  సెకండ్ హాఫ్
  ట్విస్ట్స్
  ఫ్లాష్ బ్యాక్

 • మైనస్ పాయింట్స్:
  స్లో ఫస్ట్ హాఫ్
  తికమక పెట్టె కొన్ని సన్నివేశాలు

 • తెలుగుస్టాప్ రేటింగ్ :2.75/5

 • బోటం లైన్ – రొటీన్ సినిమాలు కాకుండా కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే 118 నచ్చుతుంది.