'118' మొదటి వారం కలెక్షన్స్‌.. నిర్మాతలు కూడా అవాక్కయి ఉంటారు  

118 Telugu Movie First Week Collections-kalyan Ram,nivetha Thomas,rs 7.40 Cr

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘118’ చిత్రంకు మొదట నెగటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ మాత్రం ఒక మోస్తరుగానే రాబట్టింది. ముఖ్యంగా మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. శివరాత్రి సెలవులు అవ్వడంతో పాటు, ఇతర సినిమాలు పోటీ లేకపోవడంతో 118 చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌గా బయట పడిపోయారు. భారీగా వసూళ్లు రాకపోయినా కూడా తక్కువ మొత్తానికే ఈ చిత్రాన్ని అమ్మిన కారణంగా బయ్యర్లు సేఫ్‌ అయ్యారు..

'118' మొదటి వారం కలెక్షన్స్‌.. నిర్మాతలు కూడా అవాక్కయి ఉంటారు-118 Telugu Movie First Week Collections

కళ్యాణ్‌ రామ్‌ జర్నలిస్ట్‌గా నటించిన ఈ చిత్రం హర్రర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఆకట్టుకునే కథాంశంతో పాటు ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే సాగిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సినిమాకు అన్ని ఏరియాల్లో కలిపి 7.4 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు రెస్పాన్స్‌ చూసి ఈ చిత్రం కనీసం అయిదు కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయంగా అంతా భావించారు.

అయితే 118 చిత్రం మాత్రం ఏకంగా 8 కోట్ల వరకు రాబట్టబోతున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా అవాక్కవుతున్నారు.

ఏరియాల వారిగా ‘118’ చిత్రం మొదటి వారం షేర్‌ :

నైజామ్‌ : 2.83 కోట్లు.

సీడెడ్‌ : 1.01 కోట్లు

ఉత్తరాంధ్ర : 74 లక్షలు.

కృష్ణ : 51 లక్షలు.

గుంటూరు : 50 లక్షలు.

ఈస్ట్‌ : 43 లక్షలు.

వెస్ట్‌ : 31 లక్షలు.

నెల్లూరు : 17 లక్షలు.

ఇతరం : 60 లక్షలు.

ఓవర్సీస్‌ : 30 లక్షలు.

మొత్తం : 7.40 కోట్లు.