'118' ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా... ఇంకా ఎంత రాబట్టాలి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటీ?  

 • నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘118’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్‌ బాగా వస్తాయని ఆశించారు. కాని మొదటి రోజు మాదిరిగానే శని, ఆదివారాల్లో కూడా కలెక్షన్స్‌ తక్కువ తక్కువ నమోదు అయ్యాయి. కళ్యాణ్‌ రామ్‌ సినిమాపై ఆసక్తి లేకపోవడంతో పాటు, మార్చి నెల అంటే అన్‌ సీజన్‌ అవ్వడం వంటి కారణాల వల్ల ఈ చిత్రం సాదా సీదా కలెక్షన్స్‌ను నమోదు చేస్తున్నాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో ఈ చిత్రం వచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.

 • 118 Movie Weekend Total Collections-118 Review Kalyan Ram Nevetha Thamos

  118 Movie Weekend Total Collections

 • ఇక ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో 3.99 కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 10 కోట్లకు అటు ఇటుగా బిజినెస్‌ చేసింది. అంటే ఇంకా ఈ చిత్రం ఆరు కోట్లు రాబడితే కాని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడతారు. పరిస్థితి చూస్తుంటే అది జరగడం అసాధ్యంగానే అనిపిస్తుంది. మరో రెండు లేదా రెండున్నక కోట్లకు మించి ఈ చిత్రం వసూళ్లు చేయడం కష్టమే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌ లో మొదటి సారి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో లాభాలను ఈ చిత్రం దక్కించుకుంది. కాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం దారుణమైన నష్టాలను చవి చూస్తున్నారు.

 • 118 Movie Weekend Total Collections-118 Review Kalyan Ram Nevetha Thamos
 • ‘118’ చిత్రం మొదటి మూడు రోజుల కలెక్షన్స్‌ :

 • నైజాం : 1.69 కోట్లు

 • సీడెడ్‌ : 63 లక్షలు

 • ఉత్తరాంధ్ర : 48 లక్షలు

 • కృష్ణ : 34 లక్షలు

 • గుంటూరు : 35 లక్షలు

 • ఈస్ట్‌ : 21 లక్షలు

 • వెస్ట్‌ : 17 లక్షలు

 • నెల్లూరు : 12 లక్షలు

 • మొత్తం : 3.99 కోట్లు