118 మూవీతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్! క్లోజింగ్ కలెక్షన్  

118 మూవీ చివరి క్లోజింగ్ కలెక్షన్స్ ని ప్రకటించిన నిర్మాతలు. .

118 Movie Closing Collections-closing Collections,kalyan Ram,kv Guhan,nandamuri,tollywood

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 118. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా నివేతా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటించారు. ఇక గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో పది కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది..

118 మూవీతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్! క్లోజింగ్ కలెక్షన్-118 Movie Closing Collections

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పటాస్ మూవీ తర్వాత మరో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడని తెలుస్తుంది. బయ్యర్లకి కూడా ఈ సినిమా పర్వాలేదనే లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ రూపంలో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోవడంతో సినిమా భారీ లాభాలు అర్జించింది అని చెప్పాలి.