112 పేజీల పెళ్లి పత్రిక.. ఎంత బాగుందో!

సాధారణంగా మన ఇళ్ళల్లో జరిగే పెళ్లి ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.పెళ్లి విషయంలో పెళ్లి పత్రికకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

 112 Pages Of Wedding Card,karnataka,wedding Card, Panchaksharappa, Viral Wedding-TeluguStop.com

మన ఆర్థిక స్థోమతను బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పెళ్లి పత్రికను వివిధ రకాల డిజైన్లతో తయారుచేస్తారు.సాధారణంగా పెళ్లి పత్రిక 2నుంచి ఆరు పేపర్ల వరకు ఉండడం మనం చూసి ఉంటాం.

కానీ మీరెప్పుడైనా 112 పేజీల వివాహ ఆహ్వాన పత్రికను చూశారా? అవును పెళ్లి పత్రిక ఏకంగా 112 పేజీలు తయారు చేసి తమ బంధువులకు పంచి అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది…

కర్ణాటక లోని శిమోగా జిల్లా కు చెందిన పంచాక్షరప్ప అనే వ్యక్తి తన కూతురు వివాహానికి ఏకంగా 112 పేజీల వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేయించాడు.పంచాక్షరప్ప రచయిత కావడంవల్ల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో అందరిలా కాకుండా కొంత భిన్నంగా ఆలోచించారు.

వివాహ ఆహ్వాన పత్రిక ను తయారు చేయడంలో తన రచనలనే ఆయుధంగా వాడుకొని 112 పేజీల శుభలేఖ ను తయారు చేసి బంధువులకు పంచడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

112 పేజీలు కలిగిన వివాహ ఆహ్వాన పత్రికలో పద్యాలు, కవితలు, వివాహంలో జరిగే ప్రతి కార్యక్రమం ప్రత్యేకత గురించి తెలుపుతూ ఈ ఆహ్వాన పత్రికను రూపొందించినట్లు రచయిత పంచాక్షరప్ప తెలిపారు.అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన ఆహ్వాన పత్రికలో రంగులతో కూడిన ఆర్ట్ పేపర్ తో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ పత్రికకు పంచరంగి అనే పేరుతో ముద్రించాడు.ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.112 పేజీలు ఉన్న ఈ పత్రిక గురించి తెలుసుకున్న సదరు నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube