బిగ్‌బాస్‌ 3 కి కష్టాలు.. సెన్సార్‌ ఉండాలంటూ కోర్టుకు ఎక్కిన వ్యక్తి

ఉత్తరాదిన గత పుష్కర కాలంగా విజయవంతంగా సాగుతున్న బిగ్‌బాస్‌ రెండేళ్ల క్రితం సౌత్‌లో కూడా ప్రారంభం అయ్యింది.తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకుంది.

రెండు సీజన్‌లకు కూడా మంచి రెస్పాన్స్‌ దక్కింది.మూడవ సీజన్‌ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్‌ సమస్య ఏర్పడుతుంది.మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయగా, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు.

ఇప్పుడు మూడవ సీజన్‌కు నాగార్జున చేసే అవకాశం ఉంది.

ఇక తమిళ బిగ్‌బాస్‌ విషయానికి వస్తే మొదటి రెండు సీజన్‌లకు కమల్‌ హోస్ట్‌ చేశాడు.

ఇప్పుడు మూడవ సీజన్‌కు కూడా ఆయనే సిద్దం అవుతున్నాడు.పార్టిసిపెంట్స్‌ ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయ్యింది.

ఇలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్‌ షోపై చెన్నై హైకోర్టులో పిటీషన్‌ దాఖలయ్యింది.షో పేరుతో అశ్లీలంగా వ్యవహరిస్తున్నారని, ప్రైమ్‌ టైంలో వస్తున్న షో కనుక పిల్లలు పెద్దలు అంతా చూస్తున్నారు.

అశ్లీలంగా ఉన్న షాట్స్‌ వల్ల పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటీషనర్‌ పేర్కొన్నాడు.

బిగ్‌బాస్‌ 3 కి కష్టాలు సెన్స�

పిటీషనర్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు బిగ్‌బాస్‌ నిర్వాహకులకు మరియు కమల్‌ హాసన్‌కు నోటీసులు జారీ చేయడం జరిగింది.రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని, ఎందుకు సెన్సార్‌ చేయనక్కర్లేదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఇలాంటి నోటీసులు నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారాయి.

బిగ్‌బాస్‌ ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్‌ చేయడం అంటే మాటలు కాదని, ప్రతి విషయంలో కూడా స్వీయ నియంత్రణతోనే తమ టీం పని చేస్తుందని కోర్టుకు తెలియజేసేందుకు నిర్వాహకులు లాయర్‌ను సిద్దం చేస్తున్నారట.మరి కోర్టు వీరి సమాధానంకు ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube