హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త చరిత్ర సృష్టించిన కరోనా వీరుడు 110 ఏళ్ల వృద్ధుడు.. !

ఒకటే జననం.ఒకటే మరణం.

 110 Years Old Man Ramananda Teertha Recovered From Corona In Hyderabad Gandhi Ho-TeluguStop.com

ఒకటే గమనం.ఒకటే గమ్యం.

గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు.బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు.

ఎంతో ఇన్స్‌ప్రేషన్ కలిగిస్తూ ఒత్తిడిలో ఉన్న వారిని సైతం ఉత్తేజ పరిచే ఈ పాట శ్రీహరి నటించిన భద్రచలం చిత్రంలోనిది.

సుద్ధాల అశోక్ తేజ రచించిన ఈ సాహిత్యం వింటే కరోనా సమయంలో బ్రతుకుతో పోరాడుతున్న ప్రతి వారి పోరాటానికి బాసటగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కోవిడ్ సోకగానే ఎంతో ధైర్యంగా ఉండే వారు సైతం ఢీలా పడిపోయి భయంతో ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలా మరణించిన వారి వివరాలు తెలుసుకుంటూ బ్రతికున్న వారు భయంతో చస్తున్నారు.కానీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కొత్త చరిత్ర సృష్టించింది.110 ఏళ్ల వృద్ధుడు దేశంలో కరోనాను జయించిన వీరుడుగా అధ్యాయనాన్ని సృష్టించాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

అతనే హైదరాబాద్‌లోని కీసరగుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 110 ఏళ్ల రామానంద తీర్థ. కాగా, 18 రోజుల చికిత్స అనంతరం రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.

రాజారావు తెలిపారు.కానీ ఇతని ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించాలని వెల్లడించారు.

చూశారా భయం బ్రతికుండగానే చంపేస్తే, ఆత్మస్దైర్యం మరణాన్ని సైతం జయించేలా మనిషిని నడిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube