త్వరలో చనిపోతానని తెలిసిన ఆ 11 ఏళ్ల కుర్రాడు ఏం చేసాడో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం.చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే.

 11 Year Old Chinese Boy Donates Organs To Save Others-TeluguStop.com

చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.మనం జీవితంలో చేసే ఒక్క మంచి పనైనా సరే కొన్ని వందల ఏళ్ళు మన గురించి మాట్లాడుకునేలా చేస్తాయని అంటారు మన పెద్దలు.

అలా 11 ఏళ్ళ వయస్సులోనే ప్రపంచానికి నిజమైన హీరో అని నిరూపించాడు ఈ కుర్రాడు.

హృదయాన్ని కాస్త బాధపెట్టేదే అయినా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు.చైనాకు చెందిన ఈ అబ్బాయి పేరు లియాంగ్ యోయి.9 ఏళ్ళ వయస్సు నుండి బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నాడు.ఇంకా ఎంతో కాలం బ్రతకడం కష్టమని డాక్టర్లు తేల్చిచెప్పారు.

రెండేళ్ల తర్వాత ఈ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి తీవ్రమైంది.డాక్టర్లకు కూడా ఈ విషయం చెప్పారు కుటుంబ సభ్యులు.ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయానికి హర్షించారు.11 ఏళ్ళ లియాంగ్ యోయి లివర్, కిడ్నీలను వేరేవాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి బ్రతికించారు.లియాంగ్ యోయి స్ట్రెచర్ పై ఉండగా ఆ హాస్పిటల్ డాక్టర్లు తల కిందకు ఉంచి హ్యాట్సాఫ్ తెలిపారు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అవయవదానం అవగాహన గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి.ఇతరుల ప్రాణాలను కాపాడటం కన్నా గొప్ప పని ఏముంటుంది.ఈ విషయాన్ని షేర్ చేసి అవయవధానంలోని సంతృప్తిని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube