11 మంది ప్రాణం తీసిన ఉపాధి హామీ పనులు! నారాయణ పేట జిల్లలో దారుణం  

11 మంది మహిళలని బలి తీసుకున్న మట్టి పెల్లలు..

11 Womens Died Narayanguda District-kcr,narayanguda District,telangana,trs

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు రాష్ట్రంలో ప్రజలందరిని భయపెడుతూ ఉంటాయి. అందరికి కలిసి సరదాగా గడిపే వారు క్షణాలలో మన ముందే ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి విషాదకర సంఘటన చోటు చేసుకుంది...

11 మంది ప్రాణం తీసిన ఉపాధి హామీ పనులు! నారాయణ పేట జిల్లలో దారుణం-11 Womens Died Narayanguda District

నారాయణ పేట జిల్లాలో మరికల్‌ మండలంలోని తీలేరు గ్రామంలో ఉపాధిహామీ పనుల్లో భాగంగా అక్కడ గ్రామస్తులు అధిక సంఖ్యలో తిప్పగుట్ట వద్ద మట్టి పనులు చేస్తున్నారు.

ఇక పనుల్లో చేస్తున్న సమయంలో ఊహించని విధంగా పై నుంచి మట్టి పెళ్లలు విరిగి కూలీలపై పడ్డాయి. దీంతో అక్కడ కూలీలు అందరూ ఒక్కసారిగా మట్టిలో కూరుకుపోయారు.

ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే సమాధి అయిపోయి మృతి చెందారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు అందరూ మహిళలు కావడం గమనార్హం. ఇక మట్టిలో కూరుకుపోయిన వారిని అక్కడ ఉన్న కూలీలు బయటకి తీసే ప్రయత్నం చేసారు. ఇక సంఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కూలీలంతా తీలేరు గ్రామస్తులే అని సమాచారం.