'సమంత' గురించి చాలా మందికి తెలియని 11 విషయాలివే..! మరో పేరు ఏంటి అంటే..? సిద్ధార్థ్ అలాగే పిలిచేవాడు.!  

11 Unknown Facts Samantha-

ఏం మాయ చేసావే లో జెస్సీగా కుర్రకారు మనసు మాత్రమే కాదు ఏకంగా చైతు మనసు గెలుచుకుని ,ఇప్పుడు చైతూ జీవిత భాగస్వామిగా మారింది.ఏం మాయ చేసావే తర్వాత నాగ చైతన్యతో మరో రెండు సినిమాల్లో కలిసి నటించింది.ఇప్పటివరకూ అందరూ స్టార్ హీరోలతో జత కట్టి,దక్షిణ భారతదేశంలోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా అనే ప్రశ్నకు సినిమాలు ఎక్కడ మానేసానూ అని తెలివిగా సమాధానం చెప్పింది.సమంతా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.

11 Unknown Facts Samantha--11 Unknown Facts Samantha-

1.హీరోయిన్ కాకముందు సమంతా ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది.దానికోసం ఎన్నో పార్ట్ టైం జాబ్స్ చేసింది.ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగుపెట్టింది.

డైైరెక్టర్,సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సమంతాలో నటిని మొదటి సారి గుర్తించారు.అప్పటి నుండి సమంతా వెనుదిరిగి చూసింది లేదు..

2.సమంతా ప్రత్యూష అనే స్వచ్చంద సంస్థని స్థాపించి దాని ద్వారా పిల్లలు,మహిళల ఆరోగ్య సంరక్షణ బాద్యతలు నిర్వహణ బాద్యతలు చూసుకుంటుంది.సినిమాల్లో సంపాదించినది వేరే రంగాల్లో పెట్టి మరింత సంపాదించాలనే ఈ కాలం హీరోయిన్లందరికి విభిన్నంగా సేవ వైపు వెళ్లింది సమంతా.

3.తమిళియన్ గా గుర్తింపు పొందిన సమంతా తమిళియన్ కాదు.

సమంతా తండ్రి తెలుగు,తల్లి ఏమో మళయాలి.సమంతా పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలో.

సినిమా అవకాశాలు వచ్చింది కూడా తమిళ్ లోనే.తర్వాత తెలుగులో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది.ఇప్పుడు తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడేస్తుంది.ఎంతైనా తెలుగింటి కోడలు అయ్యింది కదా.

4.చాలా మందికి సామ్ గా పరిచయమైన సమంతా .

కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే యశోదాగా తెలుసు.సిద్దార్ద్ తో డేటింగ్ లో ఉన్న టైంలో సిద్దు సమంతా ని యశ్ అనే పిలిచివాడు..

5.సమంతా తొలిచిత్రం “విన్నైతాండి వరువాయా”(ఏం మాయ చేశావే) కాదు.

రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరీ సినిమాలో నటించింది.ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఏం మాయ చేశావేలో నటించింది.ఏం మాయ చేశావే సినిమాకి మాస్కొవిన్ కావేరిలో నటన ద్వారా కాకుండా ఆడిషన్ ద్వారా సెలక్ట్ అయింది సమంతా..

6.సమంతాని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటివ్యక్తి హాలివుడ్ నటి ఆడ్రే హెప్బర్న్.

7.సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమంతా ,క్లాస్ రూం లో కూడా టాప్ స్టూడెంటే.హీరోయిన్ గా ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిన సమంతా.చదువుకునే రోజుల్లో కూడా క్లాస్ టాపర్ గా ఉండేదుకు కష్టపడి చదివేదట.

8.సౌత్ ఇండియన్ అయినప్పటికీ సమంతాకి నచ్చే వంటకాలు మాత్రం జపనీస్.

సీ ఫుడ్ ని ఇష్టంగా తింటుదట.డెయిరిమిల్క్ చాక్లెట్ అన్నా,పాలకోవా అన్నా కూడా సమంతా కి చాలా ఇష్టమట.

9.రోండా బైర్న్స్ రచించిన ది సీక్రెట్ పుస్తకం ,సమంతా కి నచ్చిన పుస్తకం.

10.సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంతా డయాబెటిక్ పేషెంట్ గా నటించింది.నిజజీవితంలో కూడా సమంత డయాబెటిక్ పేషెంట్.

2013లో డయాబెటిస్ తో ఇబ్బంది పడిన సమంతా,ఆ తర్వాత దాన్ని అధిగమించింది.

11.టాలివుడ్,కోలివుడ్లో స్టార్ అయిన సమంతా బాలివుడ్ లో కూడా నటించింది కానీ గుర్తింపు రాలేదు సరికదా కనీసం తనని గుర్తించలేదు.ఆ సినిమానే ఏక్ దివానా థా.ఏం మాయ చేశావే కి రీమేక్.ఏక్ దివానా థా లో సమంతా చిన్న పాత్రలో నటించింది.