రెండు తరాల నటులతో నటించిన 11 మంది హీరోయిన్లు వీరే.! ఓ లుక్ వేసుకోండి!  

11 Tollywood Actresses Who Worked With Two Generations Of Stars-

అతిలోక సుందరి శ్రీదేవి అందం ,అభినయం గురించి తెలియని వారుండరు.ఆమెకు మాత్రమే సంభందించిన ఒక ఇంట్రస్టింగ్ టాఫిక్ ఏంటంటే రెండు తరాల నటులతో ఆమె హీరోయిన్ గా నటించడం…ఎన్టీఆర్ తో బడిపంతులు సినిమాలు ఎన్టీయార్ కు మనుమరాలిగా నటించిన శ్రీదేవి,ఆ తర్వాత ఎన్టీయార్ పక్కన హీరోయిన్ గా అనేక సినిమాల్లో జతకట్టింది.నాగేశ్వర్రావు,క్రిష్ణ,క్రిష్ణంరాజు లాంటి పెద్ద పెద్ద నటులతో నటించింది.తర్వాత తరం నటులు వెంకటేష్,నాగార్జున లతో కూడా నటించింది.నాగార్జున,బాలక్రిష్ణలతో నటించడానికి శ్రీదేవి సుముఖత చూపించలేదట.వారి నాన్నలతో నటించాను ఇప్పుడు వీరికి జోడిగా నటించలేనని ఆమె అభ్యంతర పెట్టిందని ఎక్కడో విన్నట్టు గుర్తు.

11 Tollywood Actresses Who Worked With Two Generations Of Stars--11 Tollywood Actresses Who Worked With Two Generations Of Stars-

అయినప్పటికీ నాగార్జున పట్టుబట్టి తన సినిమాల్లో నటించారని అంటారు.ఆఖరి పోరాటం.గోవిందా గోవిందా ాసినిమాల్లో నాగార్జునతో కలిసి నటించిన శ్రీదేవి.నాగేశ్వర్రావు తో ప్రేమాభిషేకం ,శ్రీరంగ నీతులు లాంటి అనేక సినిమాల్లో జతకట్టింది.శ్రీదేవిలా రెండు తరాల నటులతో నటించిన ఇప్పటి తరం నటీమనులెవరో చూద్దామా.

11 Tollywood Actresses Who Worked With Two Generations Of Stars--11 Tollywood Actresses Who Worked With Two Generations Of Stars-

తమన్నా

మిల్కీ బ్యూటి తమన్నా భాటియా మెగా ఫ్యామిలి లోని రెండు తరాల నటులతో నటించింది.పవన్ కళ్యాణ్ తో కెమెరామాన్ గంగతో రాంబాబు,చరణ్ తో రచ్చ,బన్నితో బద్రినాద్ సినిమాలలో నటించింది.

అల్లు అర్జున్ కి ధీటుగా డ్యాన్స్ చేయగల నటి ఎవరన్నా ఉన్నారంటే తమన్నా అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

కాజల్ అగర్వాల్

టాలివుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమనుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు.రెండు తరాల నటులతో నటించడమే కాదు,మెగా ఫ్యామిలిలోని అందరి హీరోలతో నటించిన రికార్డ్ కాజల్ సోంతం.

మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెం 150,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్,రాంచరణ్ తో మగధీర,అల్లు అర్జున్ తో ఆర్యా 2 లో నటించి మెప్పించింది.

ఆర్తి అగర్వాల్

నువ్ నాకు నచ్చావ్ సినిమాతో టాలివుడ్ రంగ ప్రవేశం చేసిన ఆర్తి అగర్వాల్ అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోస్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.ఆర్తి కూడా నందమూరి వారి రెండు తరాల నటులతో నటించింది.అబ్బాయ్ ఎన్టీయార్ తో అల్లరి రాముడు,బాబాయ్ బాలక్రిష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో నటించింది.

నయన తార

నందమూరి ,దగ్గుబాటి రెండు కుటుంబాల్లోని రెండు తరాల నటులతో నటించిన రికార్డ్ నయనతార ది.వెంకటేష్ ,బాలక్రిష్ణ,రాణా ,ఎన్టీయార్ లతో నటించింది.వెంకటేష్,నయన తార ది హిట్ పెయిర్ అని చెప్పొచ్చు.లక్ష్మీతో స్టార్ట్ అయిన వీరి ప్రయాణం తులసి,బాబు బంగారంలలో కూడ ాకలిసి నటించారు.

దగ్గుబాటి రెండొ తరం నటుడు రాణా తో కృష్ణం వందే జగద్గురుమ్ లో నటించింది నయన్.బాలక్రిష్ణతో సింహాలో నటించిన నయనతారా నందమూరి మూడో తరం నటుడు ఎన్టీయార్ తో అదుర్స్ సినిమాలో కలిసి నటించింది.

త్రిష

ఎక్కువ కాలంపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ఉనికి చాటుకున్న నటి త్రిష.నందమూరి కుటుంబానికి చెందిన రెండు తరాల నటులు బాలక్రిష్ణ,ఎన్టీయార్ తో నటించింది త్రిష.వీరితో త్రిష నటించిన సినిమాలు లయన్,దమ్ము.

సమంతా

ఇలియానా

దేవదాసు సినిమాతో పరిచయం అయిన హీరోయిన్ ఇలియానా .ఇప్పటికీ తన నడుము ఒంపుతో కుర్రకారు మతి పోగొడుతుంది.పోకిరిలో మహేశ్ సరసన నటించిన ఇలియానా అందచందాల్ని ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు.మెగా కాంపౌండ్ లోని పవన్ కళ్యాన్ తో జల్సాలో నటించిన ఇలియానా,నాలుగేళ్ల తర్వాత అదే కాంపౌండ్ లోని మరో హీరో అల్లు అర్జున్ తో జులాయి సినిమాలో నటించింది.

ఈ రెండు సినిమాల దర్శకుడు త్రివిక్రమే.

అనుష్క

తెలుగు సినిమా చరిత్రలో అనుష్క తనకంటూ కొన్ని పేజీలు రాసిపెట్టుకుంది.ఒక అరుంధతి,ఒక రుద్రమదేవి,ఒక దేవసేన పాత్రలు తనకోసమే పుట్టాయా అన్నట్టుగా వాటిల్లో ఒదిగిపోయింది.ప్రేక్షకుల మదిలో కూడా నిలిచిపోయింది.వెంకటేష్ తో నాగవల్లి,చింతకాయల రవి సినిమాలో నటించిన అనుష్క,రాణాతో రుద్రమదేవిలో నటించింది.

శృతిహాసన్

అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది శృతిహాసన్ .ఐరన్ లెగ్ పేరు ని కాస్తా గబ్బర్ సింగ్ సినిమాతో చెరిపేసుకుని గోల్డెన్ లెగ్ గా మారింది.

ఆ సినిమాలో పవన్ సరసన నటించిన శృతి .మెగా ఫ్యామిలిలోని మరొ ఇద్దరు నటులతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.వారే అల్లు అర్జున్,రాంచరణ్…ఎవడు,రేసుగుర్రంలలో నటించింది.

జెనిలియా

తొమ్మిదేండ్ల ప్రేమాయణానికి పెళ్లితో చెక్ పెట్టి సినిమాలకు దూరం అయిన జెనీలియా అల్లరి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు.తెలుగులో జెనీలియా నటించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్.వాటిల్లో తన నటన సూపర్ హిట్.జెనీలియా కూడా రెండు తరాల నటులతో నటించింది వారే వెంకటేశ్,రానా.రాణా తో నాఇష్టం సినిమాలో నటించిన జెనీలియా,వెంకటేశ్ తో సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించింది.

ఛార్మీ

పద్నాలుగేళ్లకే సినిరంగ ప్రవేశం చేసి నీతోడు కావాలి అనే సినిమాలో నటించింది ఛార్మీ కౌర్.పంజాబ్ బ్యూటి అయినప్పటికీ తెలుగు త్వరగానే నేర్చుకుని తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకునేది.

అంతే కాదు తన జెనరేషన్ నటీమనుల్లో హీరోయిన్ ఓరియంటేడ్ సినిమాలు చేసింది ఛార్మీనే.బాలక్రిష్ణతో అల్లరి పిడుగు,ఎన్టీయార్ తో రాఖీలో నటించి ఛార్మీ కూడా రెండు తరాల నటులతో నటించిన హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

శ్రీయ

శ్రీయ సినీరంగ ప్రవేశం జరిగింది రెండువేల ఒకటిలో.ఇన్నేళ్లయినా ఎందరో హీరోయిన్స్ వచ్చారు పోయారు శ్రీయ మాత్రం చెక్కుచెదరని అందంతో ఇంకా సినిమాల్లో కంటిన్యూ అవుతుంది.2002లో బాలక్రిష్ణతో చెన్నకేశవరెడ్డిలో నటించిన శ్రీయ పదిహేనేళ్ల తర్వాత గౌతమీ పుత్ర శాతకర్ణిలో మళ్లీ బాల క్రిష్ణతో కలిసి నటించింది.ఎన్టీయార్ తో నా అల్లుడు సినిమాలో నటించింది శ్రీయ.