ఈ 11 పనులు మనం రోజు తప్పుగా చేస్తున్నాము.! అవి ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తాయో తెలుసా.? కరెక్ట్ ఇలా.!  

ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక పనులు చేస్తుంటాం. ముఖ్యంగా ఇంట్లో ఉన్నంత సేపు ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇక బయటకు వెళ్లినా ఏదొ ఒక పని చేయక తప్పదు. అయితే మనం ఏ పని చేసినా దాంట్లో మనకు అనారోగ్యాన్ని కలిగించే అంశాలు కొన్ని దాగి ఉంటాయి. ఉదాహరణకు ఇంటి పనినే తీసుకుంటే కిచెన్‌ లో సింక్‌లో గిన్నెలు కడిగామనుకోండి సింక్‌ అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది కదా. మరా పనిలో మనకు అనారోగ్యాన్ని కలిగించే అంశం ఉంది కదా. ఇలా అన్నమాట. ఈ క్రమంలోనే నిత్యం మనం చేసే ఈ పనుల్లో మనకు అనారోగ్యాన్ని కలిగించే అంశాలు ఏమేం దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చాలా మంది సింక్‌లో వంట పాత్రలను తోమడానికి ముందు నానబెడతారు. తరువాత వాటిని తోమేస్తారు. అయితే వంట పాత్రలను తోమాక చాలా మంది సింక్‌ను కడగరు. అలాగే ఉంచుతారు. దీని వల్ల సాల్మొనెల్లా వంటి అనేక రకాల బాక్టీరియాలు వ్యాపించి అనారోగ్యాలను కలిగిస్తాయి. ముఖ్యంగా టైఫాయిడ్‌ వంటి విష జ్వరాలు వస్తాయి. కనుక ఎవరైనా సింక్‌లో వంట పాత్రలను తోమాక దాన్ని శుభ్రంగా కడగాలి. దీంతో బాక్టీరియా నశిస్తుంది. అనారోగ్యాల బారిన పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

11 Things You Do Every Day That Are Bad For Your Health

2. చాలా మంది ఏదైనా తింటానికి ముందు కేవలం 5 సెకండ్ల పాటు మాత్రమే చేతులను కడుగుతారు. ఇక కొందరు వేడి నీటితో చేతులను కడుక్కుంటారు. కానీ నిజానికి ఇవి రెండూ శ్రేయస్కరం కాదు. ఎందుకంటే చేతులను వేడి నీటితో కడిగామా, చల్లని నీటితో కడిగామా అన్నది కాదు, ఎంత సేపు కడిగాము, దేంతో కడిగాము అన్నది ముఖ్యం. కనుక సబ్బుతో చేతులను 30 సెకండ్ల పాటు అయినా శుభ్రంగా కడగాలి. దీంతో వాటికి ఉండే బాక్టీరియా, ఇతర క్రిములు నశిస్తాయి. రోగాలు రాకుండా ఉంటాయి.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

3. కొందరు మేకప్‌ చేసుకుని వ్యాయామం చేస్తారు. అలా చేయరాదు. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు చర్మం నుంచి వచ్చే చెమట వల్ల చర్మం శ్వాస తీసుకున్నట్టు అవుతుంది. అలాంటప్పుడు మేకప్‌ వేసుకుని ఉంటే చెమట రాదు. చర్మానికి శ్వాస సరిగ్గా ఆడదు. దీంతో చర్మానికి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

4. చాలా మంది చేతులను నీటితో కడిగాక ఆ తడి తుడుచుకునేందుకు హ్యాండ్‌ డ్రయర్లను వాడుతారు. కానీ వాటిని వాడరాదు. ఎందుకంటే.. ఎలక్ట్రిక్‌ హ్యాండ్‌ డ్రయర్లలో బాక్టీరియా టన్నుల కొద్దీ ఉంటుంది. అలాంటప్పుడు వాటి కింద చేతులను ఉంచితే ఆ బాక్టీరియా మన చేతులకు కూడా అంటుకుంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక చేతులను కడిగాక నాప్‌కిన్‌ టవల్స్‌ లేదా టిష్యూ పేపర్లను వాడాలి.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

5. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు లేదా సామాన్లు ఏవి తెచ్చుకున్నా కొందరు ఉపయోగించిన సంచులనే మళ్లీ మళ్లీ వాడుతారు. ఇలా చేయరాదు. ఎందుకంటే వాటిల్లో బాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. అది మనం తెచ్చుకునే వస్తువులపై చేరుతుంది. దీంతో వ్యాధులు వస్తాయి. కనుక ఎప్పుడు కూరగాయలు లేదా సామాన్లు తెచ్చుకున్నా తాజా సంచులను వాడాలి.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

6. మాంసం, కూరగాయలను చాలా మంది ఒకే చాపింగ్‌ బోర్డుపై కట్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల మాంసంలో ఉండే హానికారక బాక్టీరియా చాపింగ్‌ బోర్డుపై చేరి తరువాత కూరగాయలకు అంటుకుంటుంది. ఈ క్రమంలో ఆ కూరగాయలకు ఉన్న బాక్టీరియా అంత సులభంగా పోదు. దీనివల్ల మనకు వ్యాధులు వస్తాయి. కనుక మాంసానికి, కూరగాయలను కట్‌ చేసేందుకు వేర్వేరు చాపింగ్‌ బోర్డులు వాడాలి. వాటిని ఉపయోగించాక ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగాలి.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

7. చాలా మంది ఆఫీసుల్లో ఉండే కాఫీ మెషిన్లలో కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. నిజానికి వీటిల్లో బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిల్లో తయారయ్యే కాఫీ లేదా టీని తాగకపోవడమే ఉత్తమం. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

8. స్మార్ట్‌ఫోన్లను చాలా మంది పర్సుల్లో, హ్యాండ్‌ బ్యాగుల్లో పెడతారు. ప్రధానంగా మహిళలు ఇలా చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల సదరు బ్యాగుల్లో ఉండే బాక్టీరియా ఫోన్‌పైకి చేరి ఆ తరువాత దాంతో మన శరీరంలోకి ప్రవేశించి మనకు వ్యాధులను కలగజేస్తుంది. కనుక సెల్‌ఫోన్లను ఎప్పుడూ ప్యాంట్‌ లేదా షర్ట్‌ జేబులో పెట్టుకోవడం ఉత్తమం.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

9. చాలా మంది ఒక సీజన్‌లో వేసుకునే దుస్తులను మరొక సీజన్‌ లో ఉతుకుతారు. ఇలా చేయడం వల్ల వాటిల్లో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములు మనలోకి ప్రవేశించి మనకు వ్యాధులను కలగజేస్తాయి. కనుక ఏ సీజన్‌లో వాడే దుస్తులను ఆ సీజన్లోనే వాడాలి. వాటిని ఆ సీజన్‌లోనే వాష్‌ చేయాలి.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

10. చాలా మంది మాంసాహారం తెచ్చి కడిగాక కొంత ఆలస్యంగా దాన్ని వండుకుందామనుకునే సమయంలో ఆ మాంసాన్ని అలాగే ఉంచుతారు. దాన్ని ఫ్రిజ్‌లో పెట్టరు. దీని వల్ల మాంసంపై బాక్టీరియా బాగా పెరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక మాంసం తెచ్చుకున్న వెంటనే వండుకునేట్టయితే ఓకే. ఆలస్యమయ్యేట్టు ఉంటే దాన్ని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టి ఫ్రాస్ట్‌ చేయాలి. దీంతో బాక్టీరియా చేరదు. మాంసం ఫ్రెష్‌గా ఉంటుంది.

11 Things You Do Every Day That Are Bad For Your Health-

11. ఇతరులతో ఆహారాన్ని షేర్‌ చేసుకుని తింటే అలాంటి వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక మీరు ఇల్లు లేదా ఆఫీస్‌ ఎక్కడైనా మీరు తినే ఆహారాన్ని ఇతరులతో షేర్‌ చేసుకుని తినేందుకు వీలైనంత వరకు యత్నించండి. అయితే అనారోగ్యంగా ఉన్నవారితో మాత్రం ఫుడ్‌ను షేర్‌ చేసుకోరాదు. ఎందుకంటే వారి అనారోగ్యం మనకు వస్తుంది కదా..!

11 Things You Do Every Day That Are Bad For Your Health-