13 నిముషాల్లో 11 కి.మీ.. చ‌నిపోతూ ఇంకొక‌రికి ప్రాణం పోసిన కానిస్టేబుల్

కొందరి గొప్ప మ‌న‌సు చూస్తుంటే మ‌న గుండెలు తరుక్క‌పోతుంటాయి.తాము చ‌నిపోతూ కూడా ఇత‌రుల‌కు ప్రాణం పోసేందుకు వారు ఆరాట‌ప‌డుతుంటారు.

 11 Km In 13 Minutes A Constable Who Died And Gave His Life For Another-TeluguStop.com

అనుకోకుండా జరిగే ప్ర‌మాదాల్లో చాలామంది బ్రెయిన్ డెడ్ అవుతుంది.ఇక అలాంటి వారు త‌మ గుండెను ఇత‌రుల‌కు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తుంటారు.

వారు చేసే మంచి ప‌నితో ఒకిరికి ప్రాణం పుడుతుంది.ఇక ఇలాంటి వారి గుండెల‌ను ఎంతో దూరం ఉన్నాకూడా కేవ‌లం త‌క్కువ వ్య‌వ‌ధిలోనే చేర్చి ప్రాణాల‌ను నిలుపుతుంటారు అంబులెన్సు డ్రైవ‌ర్లు.

 11 Km In 13 Minutes A Constable Who Died And Gave His Life For Another-13 నిముషాల్లో 11 కి.మీ.. చ‌నిపోతూ ఇంకొక‌రికి ప్రాణం పోసిన కానిస్టేబుల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పుడు కూడా అద్భుత‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది.

హైదరాబాద్ గ‌న‌రంలోని లోని కొండాపూర్ ఏరియాలో 8th బెటాలియన్ లో భాగంగా కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తున్నాడు వీరబాబు.

నిత్యం డ్యూటీ మీద ఉండే వీర‌బాబు ఏదో ఒక ప‌నిమీద ఖమ్మం వెళ్లాడు.అయితే ఖ‌మ్మంలో జరిగిన బస్సు యాక్సిడెంట్‌లో వీర‌బాబు తీవ్రంగా గాయపడ్డాడు.కాగా ఈ ప్ర‌మాదంలో వీరబాబు బ్రెయిన్ డెడ్ కావ‌డంతో అంతా శోక‌సంద్రంలో మునిగిపోయారు.ఇక ఇంత బాధ‌లో కూడా కుటుంబ సభ్యులు ఆయ‌న గుండెను దానం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

అయితే వీర‌బాబు గుండెను నిమ్స్ హాస్పిట‌ల్‌లో ఉన్న ఓ పేషెంట్ కి పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

Telugu Ambulance, Brain Dead, Constable, Constable Veerababu, Heart Donation, Heart Transplat, Malakpet, Road Accindent, Viral News, Yashoda Hospital-Latest News - Telugu

మలక్ పేట్ యశోద లో చికిత్స పొందుతున్న వీర‌బాబు గుండెను 11కిలోమీటర్ల దూరంటో ఉన్న‌టువంటి నిమ్స్ హాస్పిట‌ల్‌కు కేవలం 13నిమిషాల్లోనే చేర‌వేర్చారు.ఇంత తక్కువ టైమ్‌లోనే గుండెను తరలించేందుకు పోలీసులు ముంద‌స్తుగా అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ల‌తో సమన్వయం చేసుకుని చాలా తక్కువ టైమ్ లోనే వీర‌బాబు గుండెను చాలా సేఫ్‌గా నిమ్స్ హాస్పిట‌ల్‌కు చేర‌వేశారు.ఇక వీర‌బాబు గుండెను విజ‌య‌వంతంగా నిమ్స్ లోని పేషెంట్‌కు అమర్చనున్నారు.

అయితే వీర‌బాబును ప్ర‌తి ఒక్క‌రూ కూడా ప్ర‌శంసిస్తున్నారు.ఇలాంటి వారు ప్ర‌తి చోట ఉండాల‌ని కోరుకుంటున్నారు.

#Heart #Malakpet #Ambulance #Brain #Yashoda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు