దొడ్డిదారిలో అక్రమ నివాసం: యూఎస్‌లో 11 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌  

11 indian students among 15 arrested for trying to illegally remain in us, indian students, Illegally staying, US, Foreign, Immigration,Federal law Enforcement - Telugu 11 Indian Students Among 15 Arrested For Trying To Illegally Remain In Us, Federal Law Enforcement, Foreign, Illegally Staying, Immigration, Indian Students, Us

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగం.భారతీయ విద్యార్థులు.

TeluguStop.com - 11 Indian Students Arrested Illegally Remain In Us

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది విద్యార్థుల లక్ష్యం! ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసుకుంటున్న చాలామందికి యూఎస్‌లో ఉన్నత విద్య.తర్వాత అక్కడే ఉద్యోగం.

ఆపై హెచ్-1బి సొంతం చేసుకోవాలనే ఆశ!! అలాంటి విద్యార్థులకు.చక్కటి అవకాశం కల్పిస్తోంది.

TeluguStop.com - దొడ్డిదారిలో అక్రమ నివాసం: యూఎస్‌లో 11 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)’ విధానం.ఈ విధానాన్ని అడ్డుపెట్టుకుని అగ్రరాజ్యంలో అక్రమంగా నివసిస్తున్న 11 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు.
అమెరికాకు చెందిన ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ అధికారులు బుధవారం (అక్టోబర్ 21) దేశంలో అక్రమంగా నివసిస్తున్నారనే ఆభియోగాలపై మొత్తం 15 మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేశారు.వీరిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు
బోస్టన్‌‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంతాల నుంచి వీరందరినీ అరెస్టు చేశారు.

వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT)’ అనే వెసులుబాటును ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ (ఐసీఈ) అధికారులు పేర్కొన్నారు.విదేశీ విద్యార్థులకు వారు చదివిన రంగంలో ఒక ఏడాది పాటు పనిచేసే అవకాశం ఓపీటీ కల్పిస్తుంది.

STEM ఓపీటీలో పాల్గొంటే మరో 24 నెలలు పనిచేస్తూ అక్కడే ఉండొచ్చు.కానీ, వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

అరెస్టైన విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.స్టూడెంట్ వీసా వ్యవస్థలో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కొన్ని ఏజెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయని హెచ్చరించారు.మరోవైపు ఈ వార్త భారత్‌లోని తల్లిదండ్రులను షాక్‌కు గురిచేసింది.

తమ బిడ్డల క్షేమ సమాచారంపై వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#11Indian #FederalLaw #Foreign #Immigration #Indian Students

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

11 Indian Students Arrested Illegally Remain In Us Related Telugu News,Photos/Pics,Images..