ఖాళీ కడుపుతో ఇది తాగితే...షుగర్, బిపి, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి 11 సమస్యలకు చెక్ పెట్టొచ్చు.!

బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు.అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు.

 11 Health Benefits Of Barley Water-TeluguStop.com

అలా ఏం కాదు.ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి.అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి.

దీంతో బార్లీ గింజ‌లు మెత్త‌గా మారుతాయి.వాటిలోని పోష‌కాల‌న్నీ ఆ నీటిలోకి వెళ్తాయి.

అనంత‌రం ఆ నీటిని చ‌ల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మ‌ర‌సం లేదా ఒక టీస్పూన్ తేనెను క‌లుపుకుని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి.దీంతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

1.పైన చెప్పిన బార్లీ నీటిని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ‌, విష ప‌దార్థాల‌న్నీ మూత్రం రూపంలో బ‌య‌టికి వెళ్లిపోతాయి.పెద్ద పేగు శుభ్రం అవుతుంది.ఇది కోల‌న్ క్యాన్స‌ర్ రాకుండా చేస్తుంది.

2.బాగా వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల దాన్నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

3.క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

4.బార్లీ నీటిలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి.ఇవి కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.

5.మ‌ధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగ‌డం ఎంతో మంచిది.ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్ర‌హించ‌డాన్ని ఆల‌స్యం చేస్తుంది.

దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు.

6.బార్లీలో పీచు ప‌దార్థం పుష్క‌లంగా ఉంటుంది.ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది.

7.శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.బీపీ అదుపులో ఉంటుంది.

8.గ‌ర్భంతో ఉన్న స్త్రీలు బార్లీ వాట‌ర్ తాగితే మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.ఇత‌రుల‌కు కూడా మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉంటే బార్లీ నీటిని నిత్యం తాగ‌వ‌చ్చు.

9.కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే శ‌క్తి బార్లీ నీటికి ఉంది.రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు క‌రిగిపోతాయి.

10.బాలింత‌లు బార్లీ వాట‌ర్ తాగితే పాలు బాగా ప‌డ‌తాయి.జీర్ణ‌శ‌క్తి బాగా పెరుగుతుంది.

11.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బార్లీ వాట‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.దీంట్లో ఉండే పోష‌కాలు శ‌రీర మెట‌బాలిజంను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి.

దీంతో బ‌రువు త‌గ్గుతారు.అయితే బ‌రువు త‌గ్గాల‌నుకుంటే బార్లీ వాట‌ర్‌ను ఉద‌యంతోపాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube