అమెరికాలో గర్జించిన గన్.. 11 మందిని పొట్టనపెట్టుకున్న అగంతకులు.. !

అమెరికాలో రోజు రోజుకు అగంతకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.ఇక్కడ జీవించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్దితులు నెలకొన్నాయి.

 Gun Man Kills Six Members At Birthday Party In Us,america, Gun Firing, Gun Cultu-TeluguStop.com

అసలు ఎందుకు ప్రజలను చంపుతున్నారో తెలియడం లేదు.ఇక ఆత్మ రక్షణ కోసం తీసుకున్న గన్ హత్యలు చేయడానికి మాత్రం ఈ దేశంలో బాగా పనికి వస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్దితుల్లో అమెరికాలో మనుషుల ప్రాణాలు తుపాకీ తూటాల ఆకలి తీర్చేవిగా మారిపోయాయి.

ఇకపోతే తాజాగా మరోసారి అమెరికాలో గన్ గర్జించింది.

ఈ భీభత్సం వల్ల రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది మరణించినట్లుగా సమాచారం.ఆ వివరాలు చూస్తే.

కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్‌లో ఓ కుటుంబం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది.ఊహించని విధంగా అక్కడికి వచ్చిన నిందితుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఘటన స్దలంలోనే ఆరుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారట.

ఇక ఉడ్‌ల్యాండ్‌లో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.నిందితుడు తన పొరుగు ఇంటిలోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.అప్పటికి శాంతించని ఆ నేరస్దుడు ఆ ఇంటికి నిప్పు పెట్టాడట.ఇలా ఈ దేశంలోని మనుషుల్లో పెరిగి పోతున్న హింసాప్రవృత్తి ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube