పదిలో 68 శాతం బాలికకు ఏకంగా ఓ ఇంటినే బహుమతిగా ఇచ్చిన మున్సిపల్ అధికారులు ...!

ఎలాంటి పరిస్థితుల్లో అయినా చదువుకోవాలని ఉంటే… ఏ ప్రైవేట్ కాన్వెంట్ అవసరం లేదు, ప్రభుత్వ పాఠశాల అవసరం లేదు.ఇకపోతే ఓ బాలిక ఫుట్ పాత్ పై జన్మించింది.

 Own House Gifted Municipal Officers Who Passed 10th Class With 68 Percentage., M-TeluguStop.com

ఆ ఫుట్ పాత్ పైనే పెరిగింది.తనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే… చివరికి తాను సాధించాల్సింది సాధించింది.

ఎటువంటి సహకారం లేకపోయినా ఆమె పదో తరగతి వరకు ఫుట్ పాత్ వేదికగానే చేసుకొని తన విద్యాభ్యాసం కొనసాగింది.తన కష్ట పలితమే పదవ తరగతి ఫలితాల్లో 68 శాతం మార్కులు సాధించి తన తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషాన్ని నింపింది.

అయితే ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చోటు చేసుకుంది.ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఆ అమ్మాయి సాధించిన మార్కులకు బహుమానంగా ఇల్లు ను ఇచ్చారు.

ఇక ఆ అమ్మాయి కుటుంబ విషయానికి వస్తే… తన తల్లి, తండ్రి మరో ఇద్దరు పిల్లలు మొత్తం ఐదు మంది ఫుట్ పాత్ మీద జీవనం కొనసాగించేవారు.ఆ ముగ్గురు పిల్లలు ఒకరి ఓ కుమార్తె భర్తీ కాండేకర్.

ఈ అమ్మాయి పట్టుదలతో చదువుకొని తన విద్యను పదో తరగతి వరకు కొనసాగించింది.ఇటీవలే తన పట్టుదలతో కారణంగా పదో తరగతిలో 68 శాతం మార్కులు సాధించింది కూడా.

ఇక ఆ అమ్మాయిని అధికారులు కొన్ని ప్రశ్నలు వేయగా అందులో తాను ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యం అని తెలిపింది.అయితే ఈ ఆ అమ్మాయి పరిస్థితిని గమనించి మున్సిపల్ అధికారులు వారికి ఓ ఇంటిని మంజూరు చేసింది.

త్వరలోనే ఆ అమ్మాయి కుటుంబం కొత్త ఇంటిలోకి వెళ్లనుంది.ఇంటిని బహుమతిగా ఇచ్చిన మున్సిపల్ అధికారులకు సదరు బాలిక కృతజ్ఞతలు తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube