ఆ బాలిక అకౌంట్లో రూ.10 కోట్లు.. ఎలా వచ్చాయంటే?  

16-year-old girl from UP\'s Balia gets ₹10 crore in bank account , UP Girl, Bank Account, 10Crores, Fraud, Cyber crime, police - Telugu 10crores, 16-year-old Girl, Bank Account, Cyber Crime, Fraud, Police, Up Girl, Uttar Pradesh

ఆ బాలిక నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక.16 ఏళ్ళు ఉన్న ఆ బాలిక తన బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు బ్యాంక్ కు వెళ్ళింది.ఇంతలోనే పెద్ద షాక్.ఎందుకు అనుకుంటున్నారా? అదేనండీ.ఆమె అకౌంట్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్ల రూపాయిలు ఉన్నాయ్.షాక్ అనిపించినప్పటికి ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో నిజంగానే జరిగింది.

TeluguStop.com - 10crore Up Girl Bank Account

అయితే అంత డబ్బు పడ్డందుకు ఆమె సంతోషించకుండా ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకే పోలీసులను ఆశ్రయించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర్ ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఓ నిరుపేద కుటుంబం జీవిస్తుంది.16 ఏళ్ల సరోజ్ అనే అమ్మాయ్ అలహాబాద్ బ్యాంక్ లో ఓ ఖాతా ఉంది.అయితే కొన్ని రోజుల క్రితం ఆమె తన అకౌంట్ లో డబ్బు ఎంత ఉందో తెలుసుకునేందుకు వెళ్ళింది.అక్కడికి వెళ్లిన ఆమెకు 9.99 కోట్ల రూపాయిలు ఉన్నాయని చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది.దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఇక ఈ ఘటనపై పోలీసులు ఆమెను అడగగా.ఆమె 2018లో బ్యాంక్ ఖాతా తెరిచినట్టు అప్పుడే కాన్పూర్ నుంచి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడని చెప్పింది.

అతని పేరు నీలేశ్ కుమార్ అని ఆమె చెప్పింది.ప్రధాన్‌ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆమె ఖాతాలోకి డబ్బు బదిలీ చేస్తాం అని చెప్పినట్టు అందుకోసం ఆమెతో ఆధార్ కార్డు, ఫొటోతో పాటు కొన్ని వివరాలు తీసుకున్నట్టు చెప్పింది.

TeluguStop.com - ఆ బాలిక అకౌంట్లో రూ.10 కోట్లు.. ఎలా వచ్చాయంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆరోజు చేసిన నెంబర్ కి ఫోన్ చెయ్యగా అతడి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినట్టు ఆమె తెలిపింది.ఈ విషయంపై మాట్లాడిన పోలీసులు కూడా ఈ డబ్బు బదిలీ వెనుక ఏదో కుట్ర ఉందని, సైబర్‌ క్రైం దొంగలే ఈ పని చేసి ఉండచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

#10Crores #Police #Bank Account #Fraud #Uttar Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

10crore Up Girl Bank Account Related Telugu News,Photos/Pics,Images..