తల్లి ప్రేమ ఎప్పటికి నిలిచే ఉంటుంది... సోషల్ మీడియాలో వైరల్  

107-year-old mother gives candy to The 87 year old daughter - Telugu 107-year-old Mother Gives Candy, 87 Year Old Daughter, China, Mother Emotion

ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ, అలాంటి తల్లి ప్రేమని ఎప్పటికి తక్కువ చేయలేము.అయితే ఈ మధ్య కాలంలో ఇండియాలో సొంత బిడ్డలని చంపుకుంటున్న తల్లులని చూసిన తర్వాత అమ్మతనం అంతరించిపోతుందా అనే సందేహం చాలా  మందిలో కలుగుతుంది.

107-year-old Mother Gives Candy To The 87 Year Old Daughter

క్షణకాలం సుఖాల కోసం పరుగులు పెడుతున్న ఆడవాళ్లు, అడ్డుగా ఉంటున్నారని బిడ్డలని కూడా హతం చేస్తున్న ఘటనలు ఈ మద్యం కాలంలో మనం చూస్తున్నాం.  ఇవన్నీ చూసిన తర్వాత కొంత భయం ఉన్న మాట వాస్తవమే అయినా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు తల్లి ప్రేమ ఎప్పటికి చావదు అని మరోసారి నిరూపించినట్లు అయ్యింది.

</br>

చైనాలో 107 సంవత్సరాల తల్లి ఓ వివాహ రిసెప్షన్ కి వెళ్లి తన 87 ఏళ్ల కుమార్తె కోసం మిఠాయిని జేబులో తీసుకొని వచ్చి కుర్చీలో కదలలేని స్థితిలో ఉన్న కూతురుకి ఇచ్చింది.తల్లి ఇచ్చిన  మిఠాయి తీసుకున్న కూతురు ఆనందంతో పొంగిపోతుంది.

ఈ వీడియో నిడివి తక్కువగానే ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది.ఈ వీడియోని లక్షల సంఖ్యలో చూడటంతో షేర్ చేసి తల్లి ప్రేమ ఆమె చనిపోయేంత వరకు ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ దృశ్యం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది.

#Mother Emotion #China

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

107-year-old Mother Gives Candy To The 87 Year Old Daughter Related Telugu News,Photos/Pics,Images..