107 సంవత్సరాల ఈ తిమ్మక్క భావి తరాల కోసం చేసిన పనికి పద్మ అవార్డు.. ఇంతకు ఈమె ఏం చేసిందో తెలుసా?

మనం ఒకటి రెండు చెట్లు పెంచితేనే గొప్పగా భావిస్తాం.ఆ చెట్టు పెరిగి పెద్దయిన తర్వాత ఆ చెట్టు నేను పెట్టాను, ఇప్పుడు అది నలుగురికి నీడను ఇస్తుందని గొప్పగా చెప్పుకుంటారు.

 107 Aged Thimmakka Got Padma Award For 400 Trees Plantation-TeluguStop.com

అయితే ఒక చెట్టు మొక్క దశలో ఉన్న సమయంలో దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి.దాన్ని కాపాడకుంటే పశువులు లేదా మరేవైనా ఆ మొక్కను నాశనం చేసే అవకాశం ఉంది.

కాని ఒక మొక్కను నాటి అంత జాగ్రత్తగా చూడటం ఎవరి వల్ల అవుతుంది.ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కొద్ది, లక్షల కొద్ది మొక్కలు నాటుతునాన కూడా అందులో వందల సంఖ్యలో మొక్కలు కూడా మనుగడ సాగించడం లేవు.

వాటికి ఎంతగా సంరక్షణ తీసుకున్నా కూడా అవి నాశనం అవుతూనే ఉంటాయి.కాని కర్ణాటకకు చెందిన తిమ్మక్క మాత్రం 400 మొక్కలను నాటి వాటిని కన్న పిల్లల మాదిరిగా చూసుకుని, వాటికి ప్రతి రోజు నీరు పోసి జాగ్రత్తగా చూసుకుంది.పిల్లలు లేని తిమ్మక్క ఆ చెట్లలో పిల్లలను చూసుకుంది.పిల్లల కంటే జాగ్రత్తగా వాటికి పోషణ ఇచ్చింది.తిమ్మక్క చాలా సంవత్సరాల క్రితం పెంచిన మొక్కలు ఇప్పుడు నలుగురికి కాదు నాలుగు వేల మందిని మనుగడ, నీడను ఇస్తున్నాయి.

107 సంవత్సరాల తిమ్మక్క ఇంకా కూడా చెట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది.చిన్నప్పటి నుండి కూడా పకృతి అంటే ప్రేమతో పెరిగింది.మేకలను, గొర్రెలను కాస్తూ పెరిగిన తిమ్మక్కకు చెట్లు పెంచాలనే కోరిక చాలా కాలం ముందే వచ్చింది.

అయితే ఆమెకు సరైన మద్దతు లేకపోవడంతో చిన్నప్పుడు తన ఆలోచన పక్కకు పెట్టింది.

అయితే పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేకపోవడంతో చెట్లను పెంచి వాటిని పిల్లల మాదిరిగా సాకింది.107 ఏళ్ల వయసులో కూడా ఆమె తన చెట్లను పిల్లల మాదిరిగా చూసుకుని మురిసి పోతుంది.అందుకే తిమ్మక్కకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చి మరీ గౌరవించింది.

కోట్లాది మందికి ఆదర్శం అయిన తిమ్మక్కకు పద్మ అవార్డు సరిపోదు అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube