ట్రంప్ నిర్ణయాలపై కోర్టుకెక్కిన ప్రజలు: నాలుగేళ్లలో 105 వ్యాజ్యాలు, ఇది ఓ రికార్డే

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.ఆయన తీరును తప్పుబడుతూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కోర్టుల్లో తేల్చుకున్నాయి.

 As On September 9, 105 Multi-state Lawsuits Were Filed Against Trump Administrat-TeluguStop.com

విదేశీ పౌరులు ముఖ్యంగా భారతీయుల అవకాశాలను దెబ్బ తీసేలా ట్రంప్ వ్యవహరించారు.ప్రధానంగా హెచ్ 1 బీ వీసాల విషయంలో ట్రంప్ నలువైపుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.

తాత్కాలిక కార్మికుల ప్రవేశంపై జూన్ 22న నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఐదు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.వీటిని ఫైల్ చేసిన వారిలో టెక్ దిగ్గజాలు, అమెరికా వ్యాపార సంస్థలు, భారతీయ పౌరులు ఉన్నారు.

ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 9 నాటికి ట్రంప్ అధికార యంత్రాంగంపై అమెరికా వ్యాప్తంగా 105 మంది డెమొక్రాట్లు, రిపబ్లికన్ అటార్నీ జనరల్స్ పిటిషన్లు దాఖలు చేసినట్లు ఓ నివేదిక చెబుతోంది.

ఇది మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన కంటే ఎక్కువ.ఇమ్మిగ్రేషన్ రెగ్యులటరీలో మార్పులతో పాటు ప్రధానంగా హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి 2017 నుంచి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైనే ఎక్కువగా వ్యాజ్యాలు దాఖలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వీటిలో ప్రధానమైనవి:


  • ఐటీ సర్వ్ అలయన్స్ vs యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)
  • హెచ్ 4 ఈఏడీ
  • ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్
  • వలస కార్మికులపై నిషేధం
  • హెచ్ 1 బీ వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube