కరోనా నుంచి కోలుకున్న 103 ఏళ్ల బామ్మ... ఎలా సాధ్యమైందంటే...?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.కరోనా భారీన పడి మెజారిటీ శాతం కోలుకుంటుండగా కొందరు మాత్రం మృత్యువాత పడుతున్నారు.

 103 Year Old Iranian Woman Make Full Recovery From Coronavirus-TeluguStop.com

తాజాగా కరోనా బారిన పడిన 103 ఏళ్ల బామ్మ కరోనా నుండి కోలుకుంది.ఇరాన్ కు చెందిన 103 ఏళ్ల బామ్మ కరోనా బారిన పడింది.

వృద్ధులకు కరోనా సోకితే బ్రతకటం కష్టమని వార్తలు వినిపిస్తున్న సమయంలో ఆమె బ్రతకటం కష్టమని ఆమె కుటుంబ సభ్యులు భావించారు.

కానీ ఆమె వైరస్ ను జయించింది.

కరోనా నుండి బామ్మ కోలుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇరాన్ దేశంలో కరోనా నుండి 91 ఏళ్ల వృద్ధుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు.

శరీరానికి కరోనాను తట్టుకోగలిగే శక్తి ఉంటే కరోనా బారిన పడినా ఏం కాదని వీరిద్దరూ నిరూపించారు.సాధారణంగా కరోనా బారిన పడిన యుక్త వయస్సు వారు త్వరగానే కోలుకుంటున్నారు.

కానీ 60 సంవత్సరాల వయస్సు దాటిన వారు కరోనా నుండి కోలుకోవడం అంత తేలిక కాదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అధికారులతో కరోనా బాధితుల గురించి ఒక అధ్యయనం చేసింది.ఒక అధ్యయనంలో 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు చనిపోయే అవకాశాలు 21.9 శాతంగా ఉన్నట్లు తేలింది.ఇరాన్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శుక్రవారం రోజున ప్రార్థనలను నిషేధించటంతో పాటు ప్రయాణాలపై కూడా పలు ఆంక్షలను విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube