102 ఏళ్ల బామ్మ స్కై డైవింగ్‌... ఎందుకు చేసిందో తెలిస్తే మీరు సిగ్గుతో తలదించుకోవడం ఖాయం  

102-year-old Woman May Just Be The Oldest Skydiver Ever -

ఈమద్య కాలంలో 60 ఏళ్లకు మించి బతకడమే గగణం అయ్యింది.అలాంటిది 80 ఏళ్లు బతికారు అంటే వారిని గ్రేట్‌గా అనుకుంటాం.

102-year-old Woman May Just Be The Oldest Skydiver Ever

ఇక వందేళ్లు బతికిన వారిని అతి తక్కువగా చూస్తూ ఉంటాం.వందేళ్లు బతికినా కూడా బెడ్‌ మీద నుండి లేకుండా ఎక్కువ శాతం మంది ఉంటారు.

కాని లక్షల్లో ఒక్కరు మాత్రమే వందేళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారు.ఆస్ట్రేలియాకు చెందిన బామ్మ ఓషిమా 100 ఏళ్లు పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అయ్యింది.

102 ఏళ్ల బామ్మ స్కై డైవింగ్‌… ఎందుకు చేసిందో తెలిస్తే మీరు సిగ్గుతో తలదించుకోవడం ఖాయం-General-Telugu-Telugu Tollywood Photo Image

అంటే ఆమె వయసు ప్రస్తుతం 102 ఏళ్లు.ఈ వయస్సులో ఆమె చేసిన పనికి వయసులో ఉన్న వారు అంతా కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఆస్ట్రేలియాకు చెందిన 102 ఏళ్ల ఓషిమా అనే బామ్మ ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉంది.తన 100వ బర్త్‌డే సందర్బంగా స్కై డైవింగ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ వయస్సులో స్కై డైవింగ్‌ ఏంటీ అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రపంచం మొత్తం కూడా ఆమె గురించి మాట్లాడుకోవడం, ఆమె గురించిన వీడియోలను చూడటంతో అప్పుడు ఆమె విషయం కాస్త వైరల్‌ అయ్యింది.

మళ్లీ 102 ఏళ్ల వయస్సులో మరోసారి ఆమె స్కై డైవింగ్‌ చేసింది.

ఈసారి తన ఆనందం కోసం కాకుండా మోరాన్‌ న్యూరాన్‌ అనే వ్యాధితో బాధ పడుతున్న వారి సహాయార్థం ఫండ్‌ రైజింగ్‌ కోసం ఈ స్కై డైవింగ్‌ చేసింది.దీనికి స్పాన్సర్స్‌గా వచ్చిన వారు, తనకు ఆర్థిక సాయంగా వచ్చిన డబ్బును అంతటిని కూడా మోరాన్‌ న్యూరాన్‌ వ్యాధి బాధితులకు ఖర్చు చేసేందుకు ఈమె ముందుకు వచ్చింది.102 ఏళ్ల వయసులో కనీసం తినడమే ఇబ్బందిగా ఉంటుంది.అలాంటిది ఏకంగా స్కై డైవింగ్‌ చేసింది, అది కూడా ఒక చారిటీ కోసం నిజంగా బామ్మ ఓషిమా గ్రేట్‌.

నిష్ణాతుడైన ఒక స్కై డైవర్‌ ద్వారా ఓషిమా బామ్మ డైవింగ్‌ చేసింది.14 వేల అడుగల ఎత్తు నుండి బామ్మ డైవింగ్‌ చేసింది.ఆ సమయంలో కూడా ఎంతో హుషారుగా కనిపించారు.

అంతటి ధైర్యశాలి బామ్మకు ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఫిదా అవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

102-year-old Woman May Just Be The Oldest Skydiver Ever Related Telugu News,Photos/Pics,Images..

footer-test