వైరల్: రిచ్ రిసార్ట్ గా మారిన వందేళ్ల నాటి భవనం..!

అనగనగా ఓ దట్టమైన అడవి.ఆ అడవిలో ఓ విశాలమైన భవంతి.

 100years Old Halala Kanda Mansion In Sri Lanka Jungle, Halala Kanda Mansion , Sr-TeluguStop.com

రాతి గోడలు కూలిపోయి.గబ్బిలాలకు ఆవాసంగా మారిపోయి.

భయబ్రాంతులకు గురిచేసేలా ఉంది.దాదాపు 100 ఏళ్ల నాటి భవనం అది.ఒకప్పుడు అత్యంత సంపన్నులు విడిదిగా విరాజిల్లిన ఆ విలాసవంతమైన బంగ్లా తరువాత దయ్యలా కోటగా మారిపోయింది.గతకాలపు చారిత్రక ఆనవాళ్లను చాటిచెప్పేలా నిలబడిన అత్యద్భుతమైన బంగ్లా చివరికి భూత్ బంగ్లాగా మారింది.

కానీ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న బంగ్లాకు పూర్వ కల తేవాలని నలుగురు స్నేహితులు నడుం బిగించారు.దాన్ని కొని ఏకంగా అందమైన రిసార్ట్ గా మార్చేశారు.ఇప్పుడు అక్కడ ఒక్క రోజు ఉండాలంటే లక్ష కట్టాల్సిందే.మరి ఈ బంగ్లా ఎక్కడ ఉంది.

అసలు స్టోరీ ఏంటో చూద్దాం.


Telugu Halalakanda, Halala Kanda, Turns Resort, Rich Resort, Richest Resort, Sri

1912 కాలంలో ఓ శ్రీమంతుడు తన భార్య గుర్తుగా బంగ్లాని నిర్మించాడు.శ్రీలంకలోని వెలిగామ పట్టణానికి సమీపంలో ఈ అద్భుతమైన భవంతికి ‘హలాలా కండా’ అనే పేరు పెట్టుకున్నాడు.అప్పట్లో ఈ బంగ్లాలో ఇథియోపియన్ చక్రవర్తి హేలీ సెలస్సీ, అలనాటి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కేథ్ మిల్లర్ వంటి ప్రముఖులు ఈ బంగ్లాలో విడిది చేసేవారు.

కానీ రోజులు గడేచే కొద్ది ఆ బంగ్లా వైభవం తగ్గిపోయింది.అందమైన అడవిలో ఓ వెలుగు వెలిగిన ఈ అద్భుతమైన బంగ్లా శిధిలమైన భవనంలా మిగిలిపోయింది.ఆ సమయంలో నలుగురు స్నేహితులు ముందుకు వచ్చి 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనానికి ఈనాటి ఆధునికతను జత చేసి అత్యద్భుతమైన భవనంగా తీర్చిదిద్దారు.2011లో నలుగురు ఫ్రెండ్స్ ఈ భవనాన్ని రూ.2 కోట్లుకు కొన్నారు.ఇంటీరియర్ డిజైనర్ అయిన శార్ప్, అతని స్నేహితులు జెన్నీ లెవిస్‌, రిచర్డ్ బ్లీస్‌డేల్‌, బెంట్లీ డి బేయర్‌ ఆ బంగ్లాను పునర్నిర్మాణం చేసి బంగ్లాకు పునర్వైభవం తీసుకొచ్చారు.

రెండేళ్లు కష్టపడి చారిత్రాత్మకత దెబ్బతినకుండా ఇప్పటి అధునాతన సౌకర్యాలు ఉండేలా ఆ భవనాన్ని పూర్తి చేశారు.


అందమైన భవానికి మరింత లుక్ వచ్చేలా గార్డెన్‌ లో 23 మీటర్ల పొడవుతో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు.

ఈ పూల్ లో భవనం ప్రతిబింభం కనిపించేలా డిజైన్ చేశారు.అన్ని సౌకర్యాలతో ఐదు బెడ్రూం లతో అందంగా ఆకట్టుకునేలా తయారు చేశారు.

దీంట్లో 12 మంది విడిది చేయవచ్చు.ఇక్కడ ఒక మేనేజర్‌ తో పాటు ఓ చెఫ్‌, ఇద్దరు సర్వీస్‌ స్టాఫ్‌, ఇద్దరు గార్డెనర్లు, ఒక సెక్యూరిటీ గార్డుని కూడా ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube