బాలయ్య ఆలోచన మారిందా?

నందమూరి హీరో బాలయ్య 100వ సినిమా తాజాగా ఉగాది సందర్బంగా ప్రారంభోత్సవం అయిన విషయం తెల్సిందే.క్రిష్‌ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’గా బాలయ్య 100వ సినిమా రాబోతుంది.

 100th Movie: Balakrishna To Change His Mind?-TeluguStop.com

ఈ చిత్రం కోసం బాలయ్య ప్రత్యేకంగా కనిపించనున్నాడు.ఇక ఈ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటించనున్నాడు అనే వార్తలు కూడా మీడియాలో వస్తున్నాయి.

సినిమా ప్రారంభంకు ముందే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

‘శ్రీరామరాజ్యం’ మరియు ‘సింహా’ చిత్రాల్లో తనకు జోడీగా నటించిన నయనతారను తన వందవ సినిమా హీరోయిన్‌గా బాలయ్య అనుకున్నాడు.అయితే తాజాగా బాలయ్య మరో హీరోయిన్‌ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

హీరోయిన్‌కు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర ఉంది.అందుకే బాలీవుడ్‌ హీరోయిన్‌ను ఈ చిత్రంలో నటింపజేస్తే అక్కడ కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని బాలకృష్ణ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

క్రిష్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది.ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌లో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని విడుదల చేయవచ్చని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.క్రిష్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్స్‌తో చర్చలు జరుపుతున్నాడు.

మరి బాలయ్యకు జోడీగా ఎవరు ఫిక్స్‌ అవుతారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube