100 కోట్లకు అరవింద ఇంకెంత దూరం?  

100cr Collection Of Aravinda Sametha Movie-

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి కూడా ఫ్యాన్స్‌ ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫ్యాన్స్‌ అంచనాలను నిలుపుతూ ఈ చిత్రం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది..

100 కోట్లకు అరవింద ఇంకెంత దూరం?-100cr Collection Of Aravinda Sametha Movie

అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న అరవింద సమేత చిత్రం ఇప్పుడు 100 కోట్ల షేర్‌ టార్గెట్‌గా దూసుకు పోతుంది.

టాలీవుడ్‌ కు చెందిన అతి కొద్ది మంది హీరోలు మాత్రమే వంద కోట్ల క్లబ్‌ లో చేరారు. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్టీఆర్‌ చేరాలంటూ ఫ్యాన్స్‌ చాలా ఆశపడుతున్నారు. ఈ చిత్రం విడుదలైన 11 రోజుల్లో 91 కోట్ల షేర్‌ను రాబట్టింది. మరో 9 కోట్ల షేర్‌ను దక్కించుకుంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 100 కోట్ల క్లబ్‌ కు ఈ చిత్రం చేరే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ టాప్‌ చిత్రాల జాబితాలో ఇప్పటికే చేరిపోయిన ఈ చిత్రం ఆ 9 కోట్లను దక్కించుకుంటే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లుగా అవుతుందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం అరవిందకు పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలు ఏవీ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. అందుకే ఈ చిత్రం ఆ 9 కోట్లను రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాదని సినీ వర్గాల వారు అంటున్నారు. రాబోయే శని, ఆదివారాల్లో ఈ చిత్రం తప్పకుండా భారీ షేర్‌ను దక్కించుకుని 100 కోట్ల క్లబ్‌ లో చేరడం ఖాయం అంటున్నారు. ఆది వారం వరకు ఈ చిత్రం 100 కోట్ల షేర్‌ ను దక్కించుకుంటే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులు ఉండక పోవచ్చు. త్రివిక్రమ్‌ మ్యాజిక్‌ చేసి ఈ చిత్రంను సూపర్‌ హిట్‌ చేసి ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను ఇచ్చాడు.