సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా చాలామంది డైరెక్టర్ల దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందుకున్నాయి.
అయితే ఒక సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్( 1000Cr Collections ) సాధించాలి అంటే ఆ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకులు ఉన్నారు.
ఈ దర్శకులు చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించాయి.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినటువంటి సినిమాలు ఏంటి? ఆ దర్శకులు ఎవరు అనే విషయానికి వస్తే.ఈ జాబితాలో చెప్పుకోవాల్సి వస్తే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) ఒకరు.

ఈయన బాహుబలి, RRR సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈయన బాటలోనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా వస్తారు.ఈయన దర్శకత్వంలో చిన్న కేజిఎఫ్ 2 సినిమా( KGF 2 ) కూడా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అట్లీ(Atlee) ఒకరు ఈయన కూడా తాజాగా జవాన్ సినిమా( Jawan ) ద్వారా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించారు.దీంతో ఈయన కూడా ఆ జాబితాలో చేరిపోయారు.ఇలా ముగ్గురు సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ జాబితాలో నితీష్ తివారి(Nitesh Tiwari)దంగల్ సినిమా ద్వారా

ఈయన కూడా 1000 కోట్ల కలెక్షన్లను సాధించి ఈ జాబితాలో చేరిపోయారు.ఇక తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిద్ధార్థ ఆనంద్(Siddaarth Anand)సైతం ఈ జాబితాలో చేరిపోయారు.