అక్షయ్ కుమార్ సినిమాలు... వెయ్యి కోట్లు వెయిటింగ్

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ తో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ గా చెప్పుకునే ఖాన్ త్రయాన్ని కూడా బీట్ చేసి హైయెస్ట్ మార్కెట్ కలిగి ఉన్న హీరోగా అక్షయ్ కుమార్ తన ఇంపాక్ట్ చూపిస్తున్నాడు.

 1000 Crore Business Waiting On Akshay Kumar Movies-TeluguStop.com

అలాగే వేగంగా సినిమాలు చేయడంతో పాటు హిట్స్ మీద హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు.ఫ్లాప్ సినిమాకి కూడా వంద కోట్ల బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది.

ప్రస్తుతం బాలీవుడ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా అక్షయ్ తన ప్రభావం చూపిస్తున్నాడు.ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా అక్షయ్ కుమార్ సినిమాల మీదనే పడింది.

 1000 Crore Business Waiting On Akshay Kumar Movies-అక్షయ్ కుమార్ సినిమాలు… వెయ్యి కోట్లు వెయిటింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి కారణం కూడా సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు సినిమాల వరకు అక్షయ్ కుమార్ చేయడమే.ప్రస్తుతం అక్షయ్ కుమార్ కంప్లీట్ చేసిన నాలుగు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి.ఈ లెక్కన అరడజను సినిమాల వరకు కరోనా లాక్ డౌన్ అనంతరం థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి.

అక్షయ్ కుమార్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్ వస్తుంది.ఈ లెక్కన ఆయన సినిమాల కారణంగా బాలీవుడ్ లో ఓ వెయ్యి కోట్ల రూపాయిల బిజినెస్ ఆగిపోయింది.

నిజంగా ఇది పెద్ద మొత్తం అని చెప్పాలి.అయితే ఇప్పటికే కొంత మంది నిర్మాతలు అక్షయ్ కుమార్ తో చేసిన తమ సినిమాలని ఒటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

కొంత మంది మాత్రం థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.మొత్తానికి లాక్ డౌన్ ఎఫెక్ట్ అనేది అందరికంటే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మీద ఎక్కువ పడిందని దీనిని బట్టి చెప్పొచ్చు.

#AkshayKumar #1000Crore #Ram Sethu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు