జలియన్ వాలాబాగ్! వందేళ్ళ రక్త చరిత్ర  

వందేళ్ళు పూర్తి చేసుకున్న జలియన్ వాలాబాగ్. .

100 Years Of Jallianwala Bagh Massacre-bjp,britan Dom Fight,congress,jallianwala Bagh Massacre

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణత్యాగాలు ఉన్న కూడా భారత మాత నుదుటిపై రక్తపు తిలకంలా మారిన జలియన్ వాలా భాగ్ ఘటన ఇప్పటికి ప్రతి భారతీయుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా మెదులుతుంది. ఏప్రిల్ 13 1919లో జరిగిన ఈ ఘటనలో శాంతియుతంగా సమావేశం అయిన భారత స్వాతంత్ర్య వీరులపై బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. .

జలియన్ వాలాబాగ్! వందేళ్ళ రక్త చరిత్ర -100 Years Of Jallianwala Bagh Massacre

ఆ ఘటన తర్వాత భారతీయుల స్వాతంత్ర్య కాంక్ష మరింత బలపడింది.

బ్రిటిష్ వారికి ఆ ఘటన ఓ పీడకలగా మారిపోయింది. జలియన్ వాలా భాగా దురాగతంకి పాల్పడిన జనరల్ డయ్యర్ ని తరువాత భారత స్వాతంత్ర్య విప్లవ వీరులు హత్య చేసారు. భారత దేశంలో ఓ రక్తాక్షర చరిత్రగా మిగిలిపోయిన ఈ ఉదంతంగా వందేళ్ళు అయ్యింది.

ఇక కొద్ది రోజుల క్రితం బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ ఉదంతం చాలా ఘోరమైనదిగా చెబుతూ క్షమాపణలు కూడా చెప్పింది. మొత్తానికి జలియన్ వాలాభాగ్ ఉదంతం వందేళ్ళ భారతంలోనే కాదు. చరిత్ర ఉన్నంత వరకు ఓ రక్తాక్షర చరిత్రగా మిగిలే ఉంటుంది.