స్పెషల్‌ : రక్తపు మరకకు నూరేళ్లు, డయ్యర్‌ ఎంతటి దుర్మార్ఘుడో తెలుసా, అతడి మరణం ఎలాగో తెలుసా?  

100 Years Of Jallianwala Bagh Massacre-amritsar,british Indian Army,independence Day,jallianwala Bagh,tragedy

 • భారత దేశం స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ పోరాటం సాగించింది. ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులు బాశారు.

 • స్పెషల్‌ : రక్తపు మరకకు నూరేళ్లు, డయ్యర్‌ ఎంతటి దుర్మార్ఘుడో తెలుసా, అతడి మరణం ఎలాగో తెలుసా?-100 Years Of Jallianwala Bagh Massacre

 • అయితే అంత స్వాతంత్య్ర ఉద్యమంలో జలియన్‌ వాలా బాగ్‌ సంఘటన అత్యంత దారుణమైనదిగా ప్రపంచ దేశాలు, ప్రముఖులు, చరిత్ర కారులు కూడా అంటున్నారు. ఒక శాంతియుత సమావేశంకు వచ్చి బ్రిటీష్‌ సైనం జనాలపై జరిపిన కాల్పులతో వేలాది మంది చనిపోయారు, కొందరు బ్రిటీష్‌ వారి తూటాలను తప్పించుకునేందుకు అక్కడే ఉన్న బాయిలోకి కొందరు, మరి కొందరు, కాలువలోకి దూకారు.

 • అత్యంత దారుణమైన ఈ రక్తపు మరకకు నేటితో వంద ఏళ్లు అయ్యింది.

  ఇటీవలే ఇంగ్లాండ్‌ ప్రభుత్వం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే.

 • ఇండియా స్వాతంత్య్ర ఉద్యమంను ఉదృతం చేసిన ఈ సంఘటన బ్రిటీష్‌ వారు ఉన్నంత కాలం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ దురాఘతంకు పాల్పడ్డ వ్యక్తి జనరల్‌ డయ్యర్‌.

 • ఇంతటి దారుణంకు ఒడి గట్టినా కూడా అతడిని ఆంగ్లేయుల ప్రభుత్వ పెద్దలు అతడిపై చర్యలు తీసుకోలేదు. జలియన్‌ వాలాబాగ్‌లో అతడు చేసిన దురాగతంతో పాటు, ఇంకా అనేక రాక్షస చర్యలకు అతడు పాల్పడ్డాడు.

 • 100 Years Of Jallianwala Bagh Massacre-Amritsar British Indian Army Independence Day Jallianwala Tragedy

  జలియన్‌ వాలా బాగ్‌లో చనిపోయిన వారి అంత్య క్రియలు నిర్వహించేందుకు కూడా ఒప్పుకోలేదు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తప్ప మరెవ్వరు కూడా అంత్యక్రియల్లో పాల్గొనవద్దని హెచ్చరించాడు. ఆ సంఘటన జరిగిన తెల్లారి జనాలు ఎక్కడైనా కనిపిస్తే వారిపై తుపాకి గురి పెట్టించాడు.

 • ఎవరు ఎదురు దాడికి పాల్పడకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా కూడా మోకాళ్ల మీద నడవాలంటూ కఠిన నియమాలు పెట్టాడు. ఆడవారిని ఆయన సైనికులు అఘాయిత్యం చేసినా కూడా పట్టించుకోకుండా ప్రోత్సహించేవాడు.

 • అత్యంత దారుణమైన పనులు డయ్యర్‌ చేశాడు.

  100 Years Of Jallianwala Bagh Massacre-Amritsar British Indian Army Independence Day Jallianwala Tragedy

  ఇండియాలో అంతటి దారుణంకు ఒడి గట్టిన డయ్యర్‌ కొన్నాళ్లకు ఇంగ్లాండ్‌ వెళ్లాడు. అక్కడ డయ్యర్‌ ధైర్య సాహసాలకు ఒక సంస్థ 26 వేల ఫౌండ్ల బహుమానం ఇచ్చింది. అక్కడి మీడియా కూడా అతడిని ఆకాశానికి ఎత్తింది.

 • ఇక జలియన్‌ వాలా బాగ్‌ సంఘటన జరిగిన ఏడు సంవత్సరాలకు తీవ్ర అనారోగ్యంతో, పట్టించుకునే వారు కూడా లేకుండా డయ్యర్‌ చనిపోయాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు అనేక దీర్ఘకాలిక వ్యాదుల వల్ల సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డ డయ్య 1927 అక్టోబర్‌ 9న చనిపోయాడు. చనిపోయే వరకు కూడా అతడు జలియన్‌ వాలా బాగ్‌ సంఘటనను సమర్థించుకున్నాడు, అందులో తన తప్పేం లేదని, శాంతి భద్రతల కోసం తాను ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.