కెనడా: 100 మంది సిక్కుల ఉద్యోగాలు పీకేసిన ‘‘క్లీన్ షేవ్’’ నిబంధన

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 100 Sikh Security Guards Lost Their Jobs For Not Being Clean-shave And Mask Mand-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.

తాజాగా కెనడాలోని టొరంటోలో మాస్క్ తప్పనిసరి నిబంధన కారణంగా 100 మంది సిక్కు సెక్యూరిటీ గార్డులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

నిబంధనల ప్రకారం సెక్యూరిటీ విధుల్లో వున్న వారు ఖచ్చితంగా క్లీన్ షేవ్ చేయించుకోవాలి.అయితే ఈ నిబంధన మార్చాలని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్ఓ) టొరంటో నగరపాలక సంస్థను పలుమార్లు కోరింది.

ఇదిలావుండగా.పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ఈ ఘటనపై ట్వీట్ చేశారు.

గడ్డం, మీసాలు అనేవి సిక్కుల గుర్తింపని.వారి విశ్వాసానికి సంబంధించి అత్యంత విలువైనవని అన్నారు.

సిక్కుల విశ్వాసానికి విరుద్ధమైన ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టొరంటో నగరపాలక సంస్థను కోరాలని హర్జోత్ పిలుపునిచ్చారు.ఇది ప్రపంచవ్యాప్తంగా సిక్కుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కెనడాలోని సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.ఈ ఏడాది జనవరి నుంచి హోమ్‌లెస్ షెల్టర్స్ వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డులు ఎన్95 మాస్క్‌లు ధరించడాన్ని నగరపాలక సంస్థ తప్పనిసరి చేసింది.

Telugu Sikhsecurity, Canada, Clean Shave, Covid, Kesh, Shelter, Toronto, Sikh-Te

షెల్టర్ , సపోర్ట్, హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఎస్‌హెచ్ఏ) డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఎన్ 95 మాస్క్‌లను ధరించాలని, క్లీన్ షేవ్‌లో వుండాలని అధికారులు తెలిపారు.సిక్కు మతంలో ‘కేశ్’ అనేది భగవంతుని సృష్టి పరిపూర్ణతను గౌరవిస్తూ ఒకరి జుట్టు సహజంగా పెరగడానికి అభ్యాసం, అలాగే వారి మత విశ్వాసాల్లో ఇది అత్యంత కీలకమైనది.దీనిపై టొరంటో నగరపాలక సంస్థ స్పందించింది.డబ్ల్యూఎస్ఓ ఫిర్యాదు గురించి తమకు సమాచారం వుందని.ఉద్యోగాలు కోల్పోయిన వారంతా కాంట్రాక్టర్లచే నియమించబడ్డారని తెలిపింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube