నిజం భయ్యా : ఈ పెద్దాయన సిగరెట్ మానేసి ఏకంగా ఇల్లు కట్టాడంట…  

100 months of no smoking builds home, kozikode, Kerala, Man Quits smoking - Telugu 100 Months Of No Smoking Builds Home, Kerala, Kozikode, Man Quits Smoking

నువ్వు లేక నేను లేను చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సిగరెట్లు కాల్చడం మానేయాలంటూ కమెడియన్ మరియు హీరో సునీల్ కి  క్లాస్ పీకే కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటాయి.అయితే ఈ సన్నివేశం లో హాస్య నటుడు బ్రహ్మానందం సిగరెట్లు కాల్చడం మానేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వివరించిన తీరుని కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు.

TeluguStop.com - 100 Months Of No Smoking Builds Home

 దాంతో సిగరెట్లు కాల్చడం మానేసి ఏకంగా ఓ ఇల్లుని నిర్మించాడు.

వివరాల్లోకి వెళితే దేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన కోజీకోడ్ అనే ప్రాంతంలో వేణు గోపాల్ నాయర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

TeluguStop.com - నిజం భయ్యా : ఈ పెద్దాయన సిగరెట్ మానేసి ఏకంగా ఇల్లు కట్టాడంట…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇతడికి చిన్నప్పటినుంచి పొగతాగడం అలవాటయింది.దీంతో బీడీలు, సిగరెట్లు అంటూ తేడా లేకుండా రోజు 70 నుంచి 100 రూపాయల ధూమపానానికి వెచ్చించేవాడు.దీంతో ఇటీవలే ఇతడికి వయసు మీద పడడంతో వైద్యులు ఇకపై ధూమపానం చేస్తే ఖచ్చితంగా పలు ఆరోగ్య సమస్యలు మరియు గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని కాబట్టి ఇకపై ధూమపానం చేయొద్దని సూచించారు.

దీంతో వైద్యులు మరియు తన కుటుంబ సభ్యుల సలహా మేరకు వేణుగోపాల్ నాయర్ ధూమపానం చేయడం మానేశాడు.

ఇందులో భాగంగా రోజు తన ధూమపానానికి అయ్యేటువంటి డబ్బులని హుండీ ద్వారా దాచి పెట్టడం మొదలుపెట్టాడు.అయితే ఇటీవలే ఈ హుండీ ని పగల కొట్టగా ఎనిమిది సంవత్సరాలలో దాదాపుగా  5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు.

దీంతో  ఈ డబ్బుతో తన ఇంటి పై మరో అంతస్తు భవనాన్ని నిర్మించినట్లు వేణుగోపాల్ నాయర్ తెలిపాడు.అంతేగాక ధూమపానం మానేయడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని తెలియక అవసరంగా చిన్నప్పటి నుంచి లక్షల రూపాయలు వెచ్చించానని పశ్చాత్తాపం చెందాడు.

ఏదేమైనప్పటికీ ధూమపానం మానేసి ఏకంగా ఇల్లు నిర్మించుకోవడం అనే విషయం నిజంగా గ్రేట్ అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

.

#100Months #Kozikode #Kerala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

100 Months Of No Smoking Builds Home Related Telugu News,Photos/Pics,Images..