పవన్ తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నారట

పవన్ కళ్యాణ్ జోరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.గతంలో పవన్ ఇలా సినిమాలు చేసి ఉంటే ఇప్పటి వరకు 50 పూర్తి అయ్యేవి.

 100 Crores Deal With Pawan Kalyan-TeluguStop.com

భారీగా డబ్బులు కూడా వెనకేసుకునేవాడు.రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కు డబ్బులు అవసరం అయ్యింది.

దాంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.భారీ ఎత్తున అంచనాలున్న మూడు సినిమాలను పవన్ చేస్తున్నాడు.

ఆ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్నాట్లుగా సమాచారం అందుతోంది.
పవన్ తో సదరు నిర్మాణ సంస్థ రేడు సినిమాలను నిర్మించాలని భావిస్తుంది.

అందుకు గాను పవన్ కు మూడు దఫాలుగా 100 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారట.ప్రస్తుతం ఈ డీల్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

ఈ రెండు సినిమాల దర్శకులు ఇంకా ఖరారు కాలేదు.ఆ నిర్మాణ సంస్థ త్వరలోనే పవన్ తో సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు చేస్తాడట.ఇక పవన్ ప్రస్తుతం చేస్తున్న పింక్ రీమేక్ ఇంకా క్రిష్ మూవీస్ రెండు కూడా ఇదే ఏడాది లో విడుదల కాబోతున్నాయి.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా కూడా ఇదే ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ మూడు సినిమాలతో పవన్ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల సమయం వరకు పవన్ 500 కోట్లను సినిమాలతో సంపాదించాలని భావిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube