ఊరంతా కలిసి ఆ పిల్లాడికి సైకిల్ కొనిచ్చారు.. కారణం ఏంటంటే?

ఏ పిల్లాడిది అయినా సైకిల్ పోయింది అంటే ఎవరైనా ఏం చేస్తారు.పోతే పోనీలే మళ్లీ ఎప్పుడైనా కొనిస్తాంలే అని ఇంట్లో వారు సర్ది చెప్తారు.

 Town Buys Bike For 10 Years Old After His Gets Stolen Town Buys Bike, 10 Year O-TeluguStop.com

అదేంటో మరి ఈ కుర్రాడి సైకిల్ పోయిందని ఊరు ఊరంతా కలిసి పిల్లాడికి సైకిల్ కొనిచ్చారు.ఇక ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్‌లో నివసిస్తున్న లాక్లీన్ అనే పదేళ్ల బాలుడు కొద్దీ రోజుల క్రితం సైకిల్ మీద బయటకు వెళ్లాడు.అయితే ఆ బాలుడు సైకిల్ ని లాక్ చేసి పని చేసుకొని తిరిగివచ్చాడు.కానీ లాక్ చేసిన తాళం చెవి కనిపించలేదు.

దీంతో దాన్ని అక్కడే వదిలి మరుసటి రోజు డూప్లికేట్ కీతో అక్కడికి వెళ్లాడు.అక్కడ సైకిల్ లేదు.

దీంతో ఇంటికి వచ్చి దొంగలించారు అని ఏడవడం మొదలు పెట్టాడు.వాళ్ళ అమ్మ కూడా పోతే పోనీలే ఏడవకు అని సర్ది చెప్పినప్పటికి ఆ అబ్బాయ్ బాధతో ఏడుస్తూనే ఉన్నాడు.

ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రయాణించి పట్టణంలోని పెద్దలకు తెలిసింది.దీంతో వారంతా కలిసి లాక్లీన్‌కు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇంకేముంది ఫండ్ రైజింగ్ ద్వారా డబ్బులు సేకరించి అక్కడ ఓ కొత్త సైకిల్ ని కొన్నారు.ఆ అబ్బాయి పుట్టిన రోజున అంత కలిసి ఆ సైకిల్ ని ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.

ఆ సైకిల్ ని చూసిన అతడి ఆనందానికి అవధుల్లేవు.ఆ సైకిల్ ని చూసి ఆనందంతో ఏడ్చాడు.

కాగా ఒకరి సమస్య ఊరందరికీ బాధ్యత అనుకోని చెయ్యడంపై ఆ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube