10 వంటింటి చిట్కాలు... సిల్లీగా అనిపించినా ట్రై చేస్తే మీరే వావ్‌ అంటారు  

10 Useful Homemade Tips In Cooking Room-

మనం ప్రతి రోజు ఎన్నో సిల్లీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం.అంటే అన్నం మెత్తబడటం, చైర్స్‌ లేదా టేబుల్స్‌ను ప్లోర్‌ పై లాగినప్పుడు గీతలు పడటం జరుగుతుంది.

10 Useful Homemade Tips In Cooking Room-

ఇవి సిల్లీగానే అనిపించినా చాలా చిరాకు తెప్పిస్తాయి.ఇలాంటివి ఎన్నో సిల్లీ ఇబ్బందులు మనను ముఖ్యంగా ఆడవారికి చిరాకు తెప్పిస్తాయి.

అలాంటి సిల్లీ ఇబ్బందులను సునాయాసంగా ఎలా సాల్వ్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.ఈ పది చిట్కాలను వాడి ఆ సిల్లీ కష్టాలను పోగొట్టుకోండి.

10 Useful Homemade Tips In Cooking Room-

10 వంటింటి చిట్కాలు :

అన్నం వండే సమయంలో ఎసరు ఎక్కువ అయ్యిందంటే మొత్తగా ఉడుకుతుంది.మెత్తగా ఉన్న అన్నంను తినాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

చారు వంటి కూరలకు అన్నం మెత్తగా ఉన్నా పర్వాలేదు.కాని ఏదైనా కూరలోకి మెత్తగా ఉన్న అన్నంను తినాలంటే అతి చిరాకుగా అనిపిస్తుంది.

అన్నం మెత్తగా ఉడికినప్పుడు క్యారెట్‌ను అత్యంత సన్నగా తరిగి అన్నంలో కలుపుకోవాలి.అప్పుడు అన్నం మరీ మెత్తగా అనిపించదు.

కుర్చీలు, టేబుల్స్‌ను ఫ్లోర్‌ లేదా మార్బుల్స్‌పై లాగినప్పుడు గీతలు పడకుండా ఉండేందుకు వాటి కాళ్లకు పాత సాక్స్‌లను తొడిగి లాగాలి.అలా లాగడం వల్ల ఫ్లోర్‌పై ఎలాంటి గీతలు కాని, మరకలు కాని పడవు.

పట్టు చీరలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు మాత్రమే కట్టుకుంటూ ఉంటారు.నెలల తరబడి చీరలను కదిలించకుండా ఉంటే అవి భద్రంగా ఉండక పోవచ్చు.

అందుకే పట్టు చీర మడతల్లో మొగలి పూవులు పెట్టాలి.అలా పెట్టడం వల్ల చీర నాణ్యంగా ఉండటంతో పాటు, తీసినప్పుడు మంచి వాసన కూడా వస్తుంది.

మిరియాల పొడి మరియు నిమ్మరసంల మిశ్రమంను జట్టుకు పెట్టుకుని, నాలుగు అయిదు గంటల తర్వాత గోరు వేచ్చని నీటితో తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది.

పకోడి చేసేప్పుడు చేసేప్పుడు పిండిలో కాస్త నూనే మరియు చిటికెడు వంట సోడ కలిపితే పకోడిలు క్రిస్పీగా వస్తాయి

వడియాలు నిల్వ ఉంచే డబ్బాలో కాస్త ఇంగువ ఒక గుడ్డలో కట్టి వేస్తే వాటిని వేయించే సమయంలో మంచి వాసన రుచి ఉంటాయి.

బంగాలదుంపలను ఉడికించి కూర వండాలనుకున్నప్పుడు, ఉడికించడానికి ముందు అరగంట పాటు ఉప్పు నీటిలో నాననివ్వాలి.అప్పుడు బంగాళ దుంపలు అదనపు రుచిని దక్కించుకుంటాయి.

మసాలా దినుసులను మసాలాగా మిక్స్‌ చేసినప్పుడు అవి మెత్తగా అవ్వవు.వాటిని బాగా నానబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతుంది.

గ్యాస్‌ బండపై నూనె మరకలు ఉండి, జిడ్డుగా అనిపిస్తే గోధుమపిండి వేసి రుద్దితే ఆ జిడ్డు అనేది పోతుంది.

సింక్‌ లో ఎప్పుడు కూడా తడి ఉంటుంది కనుక అందులోంచి అప్పుడప్పుడు దుర్వాసన వస్తుంది.

అలా కాకుండా ఉండాలి అంటే బ్లీచింగ్‌ పౌడర్‌ వేసుకోవాలి.

ఈ చిట్టాలు పాటించి చూడండి తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది.

తాజా వార్తలు