గర్బధారణ సమయంలో ఈ 10 నిమయాలు పాటిస్తే పుట్టబోయే బిడ్డ జెమ్‌ అవుతారు  

10 Tips To Follow During Pregnancy-foods,fruits,preganancy Care,pregnancy,ఆహార పదార్థాలు

స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తడంతో సమానం. అంటే ఆ బిడ్డ కోసం తల్లి చావు అంచుల వరకు వెళ్తుంది. అంత కష్టపడి బిడ్డను కనే తల్లి బిడ్డ పుట్టిన తర్వాత లేదంటే గర్బంతో ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించరు..

గర్బధారణ సమయంలో ఈ 10 నిమయాలు పాటిస్తే పుట్టబోయే బిడ్డ జెమ్‌ అవుతారు-10 Tips To Follow During Pregnancy

అలా పాటించకపోవడం వల్ల పుట్టబోయే లేదా పుట్టిన పిల్లలు పూర్తి ఆరోగ్యం గా ఉండక పోవడం లేదంటే ఏదైనా ఒక సమస్యతో బాధ పడటం జరుగుతుంది. స్త్రీ గర్బవతిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన 10 ముఖ్యమైన జాగ్రత్తలు నిపుణులు సూచిస్తున్నారు. ఈ 10 విషయాలను గర్బవతిగా ఉన్న సమయంలో పాటిస్తే తప్పకుండా మంచి పిల్లలు పుట్టడంతో పాటు, పుట్టబోతున్న వారు ఆరోగ్యంగా, తెలివైన వారిగా పుడతారని నిపుణులు చెబుతున్నారు.

1. గర్బవతిగా ఉన్న సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలి, ఎక్కువగా టెన్షన్‌ తీసుకోకుండా ఎక్కువగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

2. పెద్దల మాట ప్రకారం గర్బంతో ఉన్న సమయంలో రామాయణం లేదా మహాభారతం చదివినా లేదా విన్నా చాలా మంచి ప్రయోజనం ఉంటుందట..

పుట్టబోయే పిల్లలు తెలివిగా పుడతారని వెళ్లడయ్యింది.

3. గర్బవతిగా ఉన్న సమయంలో తలనొప్పి, జ్వరం అంటూ ఇష్టం వచ్చినట్లుగా ట్యాబ్లెట్లు వేసుకోవద్దు. డాక్టర్ల సూచన మేరకే మందులు వాడాల్సి ఉంటుంది.

4. తల్లి కాబోతున్న వారు కాస్మోటిక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. ఈమద్య కాలంలో కాస్మోటిక్స్‌ చాలా రసాయనికంగా తయారు అయ్యాయి. తల్లి ఏ పని చేసినా కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం పడుతుంది.

5. ప్రతి రోజు కూడా కనీసం అర లీటరు పాలు అయినా గర్బవతిగా ఉన్న సమయంలో తాగాలి.

6. పండ్లు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి.

7. ఇష్టమైన ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి..

ఏది తినాలనిపిస్తే అది తినేయాలి.

8. సాదారణంగా ఉన్న సమయంకు గర్బవతి అయిన తర్వాత కనీసం 10 నుండి 15 కేజీలు అయినా బరువు పెరగాలి. అప్పుడే ఆరోగ్యంగా పిండం కడుపులో పెరిగినట్లుగా భావించవచ్చు. .

9. ఇక గర్బవతిగా ఉన్న సమయంలో ప్రధానంగా నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కనీసం 8 గంటల సమయం అయినా నిద్ర పోవాలి. ఎంత ఎక్కువ నిద్ర పోతే అంత మంచిది.

10. ఇక డెలవరీ సమయంలో టెన్షన్‌ పడటం వల్ల బీపీ అప్స్‌ అండ్‌ డౌన్స్‌ అవుతుంది. అందుకే టెన్షన్‌ లేకుండా చూసుకోవాలి.