పేర్లు మార్చుకున్న హీరోయిన్లు వీళ్ళంతా .. వీరి అసలు పేర్లు తెలుసా?   10 Popular Telugu Heroines Who Changed Their Names     2017-03-22   00:24:19  IST  Raghu V

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం. హీరోహీరోయిన్ల అపియరెన్స్ మాత్రమే కాదు, పేర్లు కూడా గ్లామరస్ గా ఉండాలి. ఇది హీరో పేరు అన్నట్లుగా ఉండాలి. అందుకే కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యాడు, కొణిదెల కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు … ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తమ పేర్లు మార్చుకున్నారు .. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా మార్చుకున్నారు. అందులో మనకు బాగా తెలిసిన తెలుగు హీరోయిన్లు ఎవరో, వారి అసలు పేర్లు ఏంటో చూద్దాం.

* జయసుధ :

సహజనటి జయసుధ అసలు పేరు సుజాత. పుట్టింది మద్రాసులో. ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయానికి మరో సుజాత ఉండటంతో ఈ సుజాత కాస్త జయసుధగా మారాల్సివచ్చింది.

* జయప్రద :

నటి, రాజకీయ నాయకురాలు జయప్రద అసలు పేరు లలిత రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్ లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో స్థిరపడిపోయింది.

-

* శ్రీదేవి :

అతిలోక సుందరి అసలు పేరు చాలా పొడవు. శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్ .. ఇది ఆవిడ అసలు పేరు. పుట్టింది తమిళనాట అయినా, సెటిల్ అయ్యింది ముంబైలో.

* సౌందర్య :

తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య అనే పేరుకి చావు లేదు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈ మహానటి అసలు పేరు సౌమ్య. పుట్టింది కర్ణాటకలో.

-

* రోజా :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మక పేరుగా మారిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాల కోసం రోజాగా మారింది.

* రంభ :

గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. స్వర్గంలో రంభ కూడా ఇంత అందంగా ఉండదేమో అని అనిపించిన ఈ భూలోక రంభ అసలు పేరు విజయలక్ష్మీ. పుట్టింది విజయవాడలో.

-

* రాశీ :

ఇటు గ్లామర్ రోల్స్ తో, అటు వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశీ అసలు పేరు మంత్ర. ఇప్పుడు కూడా ఆమెని ఈ పేరుతో పిలుస్తారు.

* అనుష్క :

కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో సౌందర్య ఎలాంటి స్టార్ డమ్ ని అయితే రుచి చూసిందో, ఇంచుమించు అలాంటి స్డార్ డమ్ పొందించి అనుష్క. ఈ బొమ్మాళి అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు.

-

* నయనతార :

కేరళ అందం నయనతార అసలు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ గ్లామర్ ప్రపంచంలోకి రాగానే నయనతారగా మారింది.

* భూమిక :

దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త భూమికగా మారి, పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.