అగ్రవర్ణ పేదల కోసం మోదీ సర్కార్ కీలక నిర్ణయం !

లోక్‌సభ ఎన్నికల్లో అగ్రవర్ణ పేదలను తమ వైపు తిప్పుకునేందుకు మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోడీ క్యాబినెట్ నిర్ణయించింది.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.అదే విధంగా 1000 చదరపు అడుగుల ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులని కేంద్రం స్పష్టం చేసింది.

 10 Persent Quota For Economically Backwards In General-TeluguStop.com

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి కారణమని విపక్షాలు అప్పుడే గగ్గోలు మొదలుపెట్టాయి.

ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.అగ్ర వర్ణాలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.ఆర్ధిక అసమానతల కారణంగా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని అన్నారు.

సామాజిక వివక్షత, సాంఘిక అసమానతలను రూపు మాపడమే రిజర్వేషన్ల లక్ష్యమని ఒవైసీ వివరించారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిద్ర పోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీస్ సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు.

నాలుగన్నరేళ్లుగా పేదలకు ఏమీ చేయని మోదీ సర్కార్ ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశాన్ని ఇలా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube